ఫిబ్రవరి 1న, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు, పార్లమెంటులో 2026-27 (Union Budget 2026-27) ఆర్థిక సంవత్సరం కోసం రూపొందించిన వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.ఈసారి బడ్జెట్‌లో వృద్ధి వేగాన్ని కొనసాగిస్తూనే, సంక్షేమ పథకాలకు, ఆర్థిక క్రమశిక్షణకు మధ్య ప్రభుత్వం సమతుల్యత పాటించనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రక్షణ, మౌలిక సదుపాయాలు, మూలధన వ్యయం, విద్యుత్, అందుబాటు ధరల్లో గృహ నిర్మాణం వంటి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చని భావిస్తున్నారు.
Read Also: Bangalore: పెంపుడు కుక్కదాడిలో మహిళకు తీవ్రగాయాలు
ఆర్థిక క్రమశిక్షణ
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో దేశీయ వృద్ధి లక్ష్యాలకు, ద్రవ్యలోటు నియంత్రణకు మధ్య బడ్జెట్ (Union Budget 2026-27) ఒక చక్కటి సమన్వయాన్ని సాధించాల్సి ఉంది. ప్రభుత్వం ఇప్పటికే ఆర్థిక క్రమశిక్షణ మార్గంలో స్థిరంగా పయనిస్తోంది. కోవిడ్ సమయంలో 9.2 శాతంగా ఉన్న ద్రవ్యలోటును 2026 ఆర్థిక సంవత్సరానికి 4.4 శాతానికి తగ్గించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది. ఈ మార్గం నుంచి ప్రభుత్వం పెద్దగా పక్కకు వెళ్లకపోవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.
గత బడ్జెట్‌లో మధ్యతరగతి వినియోగాన్ని పెంచేందుకు పన్ను రాయితీలపై దృష్టి సారించగా, ఈసారి వినియోగాన్ని ప్రోత్సహించే విధానం పరిమితంగానే ఉంటుందని తెలుస్తోంది. వ్యూహాత్మకంగా ముఖ్యమైన రంగాల్లో మూలధన వ్యయాన్ని పెంచడంపైనే ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించవచ్చని మార్కెట్ వర్గాలు అంటున్నాయి. పెట్టుబడిదారులు ప్రభుత్వ రుణాల వివరాలు, ద్రవ్యలోటు లక్ష్యాలు, కొత్త అప్పుల ప్రణాళికలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బడ్జెట్ అనగానే అందరిలో మెదిలే ప్రశ్న ఒక్కటే.. ఏయే వస్తువులు పెరుగుతాయి.. ఏయే వస్తువులు తగ్గుతాయి అనేది చూస్తూ ఉంటారు. కేంద్రం బడ్జెట్‌లో తీసుకునే నిర్ణయాలు, ట్యాక్స్ మినహాయింపులు, సుంకాలు, జీఎస్టీ రేట్లల్లో సవరణలు వస్తువుల ధరలపై ప్రభావితం చూస్తాయి. దీంతో బడ్జెట్ తర్వాత కొన్ని వస్తువుల ధరలు తగ్గనుండగా.. మరికొన్ని పెరుగుతూ ఉంటాయి.
దీంతో ఈ సారి బడ్జెట్ తర్వాత ఏయే వస్తువుల ధరలు పెరుగుతాయి.. ఏవేవీ తగ్గుతాయి అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ విషయంపై అనేక అంచనాలు వెలువడుతున్నాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ శ్లాబుల్లో మార్పులు, హోమ్ లోన్ ఈఎంఐ, ఎలక్ట్రిక్ వెహికల్స్, పెట్రోల్, డీజిల్ ధరలను ప్రభావితం చేసేలా పలు నిర్ణయాలు ఈ బడ్జెట్‌లో ఉండనున్నాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: