📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్! ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? బంగారం ధర షాక్!

Maharashtra: NCP పార్టీ భవిష్యత్‌పై అనిశ్చితి..సీఎంతో నేతల భేటీ

Author Icon By Vanipushpa
Updated: January 30, 2026 • 4:45 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్(Ajith Pawar) ఆకస్మిక మరణం తర్వాత పార్టీ భవిష్యత్‌పై తీవ్ర అనిశ్చితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ సీనియర్ నేతలు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్​ను ముంబయిలోని ఆయన అధికార నివాసం వర్షాలో కలవడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఎన్సీపీ కీలక నేతలు ఛగన్ భుజ్బల్, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్, రాష్ట్ర అధ్యక్షుడు సునీల్ టట్కరే, మాజీ మంత్రి ధనంజయ్ ముండే తదితరులు పాల్గొన్నారు. దాదాపు గంటన్నరపాటు జరిగిన ఈ భేటీలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ఎన్సీపీ భవిష్యత్ దిశపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే చర్చల వివరాలపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

Read Also: Gold Price in Hyderabad Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. ఒక్కరోజులోనే రూ. 8,230 పతనం!

Maharashtra: NCP పార్టీ భవిష్యత్‌పై అనిశ్చితి..సీఎంతో నేతల భేటీ

సునేత్ర పవార్‌ను డిప్యూటీ సీఎంగా డిమాండ్

అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, బీజేపీ, శివసేనలతో కలిసి మహాయుతి కూటమిలో భాగస్వామిగా అధికారంలో ఉంది. ఆయన మరణంతో ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు పార్టీ నాయకత్వంపై కూడా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పవార్ కుటుంబ సభ్యురాలు, రాజ్యసభ సభ్యురాలు సునేత్రా పవార్‌ను డిప్యూటీ సీఎంగా నియమించాలని ఎన్సీపీ నేత నర్హరి జిర్వాల్ బహిరంగంగా అభిప్రాయం వ్యక్తం చేశారు.

పవార్ కుటుంబ సభ్యులతో మాట్లాడాక నిర్ణయం

ఫడణవీస్​తో​ సమావేశం అనంతరం ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ, పవార్ కుటుంబ సభ్యులతో మాట్లాడి ప్రజల భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకుని త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పార్టీకి, రాష్ట్రానికి అనుకూలంగా ఉండే విధంగా ముందడుగు వేస్తామని స్పష్టం చేశారు. అజిత్ పవార్ చివరి కోరిక కూడా రెండు వర్గాల విలీనమేనని ఆయన సన్నిహితుడు, విద్యా ప్రతిష్ఠాన్ సభ్యుడు కిరణ్ గుజర్ వెల్లడించారు. కుటుంబంలో కూడా ఈ విషయంపై చర్చలు జరుగుతున్నాయని, చివరిసారి ఫోన్‌లో మాట్లాడినప్పుడు ఎన్నికలకు సంబంధించిన పత్రాల గురించి మాట్లాడారని చెప్పారు. పవార్ ఆలోచనల ప్రకారం పార్టీ ఏకీకరణ జరిగితేనే ఆయనకు నిజమైన నివాళి అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇటీవల పుణె, పింప్రీ-చించ్వాడ్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎన్సీపీ, ఎన్సీపీ (ఎస్‌సీపీ) కలసి పోటీ చేశాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Chief Minister meeting Coalition Politics Indian Politics Maharashtra politics NCP leaders NCP party party split political uncertainty Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.