📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Ukraine: ట్రంప్ 28 సూత్రాలతో రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ఇక పుల్ స్టాప్

Author Icon By Sushmitha
Updated: November 22, 2025 • 12:53 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దాదాపు నాలుగేళ్లుగా రష్యా-ఉక్రెయిన్ ల మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పటికే ఉక్రెయిన్ లోని చాలాభాగం రష్యా ఆధీనంలోకి వెళ్లింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ నిత్యం ఉక్రెయిన్ పై బాంబుల వర్షాన్ని కురిపిస్తూ, ఆదేశం బూడిద దిబ్బగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉక్రెయిన్ ప్రధాన కార్యాలయాలను తన స్వాధీనంలో తెచ్చుకునేందుకు పుతిన్ ఎడతెరపి లేకుండా దాడులకు పాల్పడుతూనే ఉన్నారు. అయితే తాజాగా యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గట్టి పట్టుదలతో ఉన్నారు. దీనికోసం గాజా శాంతి ప్రణాళిక లాంటి దాన్ని ఒకటి తయారు చేశారు. 

Read Also: Telangana: అంగన్‌వాడీ పిల్లలకు నాణ్యమైన పాలు

Ukraine Trump’s 28 principles bring a stop to the Russia-Ukraine war

28 మంది సూత్రాలతో దీన్ని రూపొందించారు. ఈ ప్రణాళికను వారం రోజుల్లో ఒప్పుకోవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకు ట్రంప్ టైమ్ ఇచ్చారు. కీవ్ వారం రోజుల్లోగా శాంతి ప్రణాళికను అంగీకరించాల్సిందేనని ట్రంప్ అల్టిమేటం జారీ చేశారు. అలా ఒప్పుకోకపోతే జీవితాంతం వాళ్లు పోరాడాల్సిందేనని అన్నారు. అయితే ఈ శాంతి ప్రణాళికను ట్రంప్ రష్యాకు అనుకూలంగా ఉందని చెబుతున్నారు. ఇందులో రష్యా ఆశిస్తున్న భూభాగాన్ని కీవ్ వదులుకోవాలని, తన సైన్యాన్ని పరిమితం చేయాలని, యుద్ధాన్ని ముగించడంతో నాటోలో చేరకుండా కట్టుబడి ఉండాలని సూత్రాలను రాశారు.

సుముఖంగా లేని జెలెన్ స్కీ

శాంతి ప్రణాళిక విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ (Zelensky) సుముఖంగా లేనట్టు తెలుస్తోంది. అన్నీ రష్యాకు అనుకూలంగా ఉండడంతో దీన్ని అంగీకరించకూడదని ఆయన  అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అవసరమైతే అమెరికాతో (America) స్నేహాన్ని కూడా వదులుకుంటామని పరోక్షంగా హెచ్చరించారు. ప్రస్తుతం తమ దేశం చరిత్రలోనే అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోంటోందని జెలెన్ అన్నారు. ఉక్రెయిన్ తన ఆత్మగౌరవాన్ని కోల్పోడమా? కీలకమైన భాగస్వామిని వదలుకోవడమా అనే దాన్ని ఎంచుకునే పరిస్థితి ఉందని చెప్పారు.

ఉక్రెయిన్ (Ukraine) ప్రయోజనాల మేరకే తమ నిర్ణయాలు తీసుకుంటామని దానికోసం అవసరమైతే మిత్రులను వదులుకుంటామని స్పష్టం చేశారు. ట్రంప్ ప్రణాళికకు సంబంధించి ప్రత్యామ్నాయాలను ప్రతిపాదిస్తామని జెలెన్ స్కీ తెలిపారు. ఇప్పటికే అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తో కూడా చర్చలు జరిపారు. యుద్ధాన్ని ఆపేయాలని మాకు కూడా ఉందని..ట్రంప్ ఆకాంక్షను కూడా గౌరవిస్తున్నామని అన్నారు. దీని కోసం త్వరలోనే ట్రంప్ తో భేటీ అవుతానని చెప్పారు.

సానుకూలంగా స్పందించిన పుతిన్

ట్రంప్ (Trump) ప్రకటించిన ప్రణాళికను రష్యా అధ్యక్షుడు పుతిని సానుకూలంగా స్పందించారు. ఉక్రెయిన్ దీనికి అంగీకరించాల్సిందేనని అన్నారు. వారు ఇప్పటికీ భ్రమలో ఉన్నారని.. తమను జయించగలరని ఉక్రెయిన్, నాటో దేశాలు కలలు కంటున్నారని విమర్శించారు. యుద్ధం ముగింపుకు రష్యా సిద్ధంగా ఉందని పఉతతిన్ తెలిపారు. ఈ ప్రణాళికపై వివరణాత్మక చర్చలు అంగీకరిస్తున్నామని.. అది జరగకపోతే యుద్ధం కొనసాగుతుందని హెచ్చరించారు. 

ప్రపంచదేశాలు కూడా రష్యా-ఉక్రెయిన్ లమధ్య యుద్ధం ఆగిపోవాలనే కోరుతున్నాయి. ఇప్పటికే కోట్లాది రూపాయల నష్టాన్ని రెండు దేశాలు చవిచూస్తున్నాయి. సైనికులు, సాధారణ పౌరులు మరణిస్తున్నారు. అయినా కూడా ఎవరికి వారే మొండిగా యుద్ధాన్ని కొనసాగిస్తున్నాయని మండిపడుతున్నాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

28-point proposal ceasefire efforts. Donald Trump Google News in Telugu International Diplomacy Latest News in Telugu Peace Plan Telugu News Today Ukraine-Russia conflict

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.