ఉన్నత చదువుల కోసం, పర్యటన నిమిత్తం బ్రిటన్ (UK) వెళ్లాలనుకునే భారతీయులకు అక్కడి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. స్టూడెంట్, విజిటర్, వర్క్ వీసాలతో పాటు అన్ని కేటగిరీల వీసా దరఖాస్తు రుసుములను పెంచుతున్నట్లు బ్రిటన్ హోమ్ ఆఫీస్ అధికారికంగా ప్రకటించింది. సవరించిన ఈ కొత్త ఛార్జీలు ఏప్రిల్ 8వ తేదీ నుంచే అమల్లోకి రానున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో విదేశీయులపై దాదాపు 6 నుంచి 7 శాతం వరకు అదనపు ఆర్థిక భారం పడనుంది.
Read Also: Zomato Platform Fee Hike: జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు పెంపు: నేటి నుంచి కొత్త ధరలు ఇవే!

బ్రిటన్ ప్రభుత్వం విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం..
గతంలో 524 పౌండ్లు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.65,730)గా ఉన్న విద్యార్థి వీసా రుసుము ఇప్పుడు 558 పౌండ్లకు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.69,814) పెరిగింది. అలాగే మూడేళ్ల కాలపరిమితి గల వర్క్ వీసా ఫీజు 769 పౌండ్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.96,466) నుంచి 819 పౌండ్లకు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.1,02,470) చేరింది. అదేవిధంగా మూడేళ్లకు పైబడిన దరఖాస్తుల రుసుము 1,519 పౌండ్ల (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.1,90.550) నుంచి 1,618 పౌండ్లకు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.2,02,437) పెరిగింది. ఇది మాత్రమే కాకుండా ఆరు నెలల కాల పరిమితి గల పర్యాటక వీసా ఛార్జీ 127 పౌండ్ల నుంచి 135 పౌండ్లకు (భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.15,935 నుంచి రూ.16,890) పెరిగింది. ఇక స్పాన్సర్ లైసెన్స్ ఫీజులు, ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ (ETA) ఛార్జీలను కూడా ప్రభుత్వం సవరించింది. ప్రతి ఏటా వేల సంఖ్యలో భారతీయ విద్యార్థులు బ్రిటన్‌కు వెళ్తుంటారు. ఇప్పటికే అక్కడ జీవన వ్యయం పెరగడంతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు.. ఇప్పుడు పెరిగిన వీసా ఫీజులు అదనపు తలనొప్పిగా మారనున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :