UK: మెహుల్ చోక్సీకి కోర్టులో చుక్కెదురు

Read Time:  1 min
UK: మెహుల్ చోక్సీకి  కోర్టులో చుక్కెదురు
FONT SIZE
GET APP

పంజాబ్ నేషనల్ బ్యాంక్ మోసం కేసులో విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకు యూకే (UK) కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.. ఆయన చెబుతున్న ‘కిడ్నాప్’ ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని పేర్కొంది. చోక్సీ ఆరోపణలే తప్ప ఆయన కిడ్నాప్ కావడం ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరూ లేరని చెప్పింది. చోక్సీ లాయర్ చూపించిన సందర్భోచిత సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని విచారణ సాగిస్తామని పేర్కొంటూ.. రూ.7.3 కోట్లు సెక్యూరిటీ బాండ్ కోర్టుకు సమర్పించాలని చోక్సీని ఆదేశించింది.

Read Also: Venkaiah Naidu remarks : బూతు రాజకీయాలు, పోలింగ్ బూత్‌లోనే సమాధానం!

UK: Mehul Choksi faces court challenge
UK: Mehul Choksi faces court challenge

కేసు ఇది?

విదేశాలకు పారిపోయిన మెహుల్ చోక్సీ కొంతకాలం ఆంటిగ్వాలో తలదాచుకున్నాడు. పంజాబ్ నేషనల్ బ్యాంకు మోసం కేసులో తనను భారత్ కు తరలించేందుకు కొంతమంది కుట్ర పన్నారని చోక్సీ ఆరోపించారు. హంగేరీకి చెందిన బార్బారా జబారికతో కలిసి భారత ఏజెంట్లు తనను కిడ్నాప్ చేశారని యూకే (UK) కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జబారిక తనతో స్నేహం నటించి ఆంటిగ్వా నుంచి బలవంతంగా డొమినికాకు తీసుకెళ్లిందని, తప్పించుకుని బయటపడిన తనను బెల్జియం పోలీసులు తనను అరెస్టు చేశారని చోక్సీ చెప్పాడు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.