ఆధార్ సేవలను మరింత సులభంగా వినియోగించుకునేందుకు UIDAI (యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) కొత్త ఆధార్ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్ ద్వారా ఆధార్‌కు సంబంధించిన ముఖ్యమైన వివరాలను సురక్షితంగా మొబైల్‌లో స్టోర్ చేసుకోవచ్చు, అవసరమైనప్పుడు ఇతరులతో పంచుకోవచ్చు.
UIDAI తమ అధికారిక X (Twitter) ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. కొత్త యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ మరియు యాపిల్ యాప్ స్టోర్ నుంచి సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొంది.
Read Also: Air Pollution : ఢిల్లీలో దారుణంగా పడిపోయిన గాలి నాణ్యత

యాప్‌లో ఉన్న ముఖ్యమైన ఫీచర్లు
- సెలెక్టివ్ షేర్ ఆప్షన్: వినియోగదారులు ఆధార్‌లోని ఎంపిక చేసిన వివరాలను మాత్రమే ఇతరులతో పంచుకోవచ్చు. మిగిలిన సమాచారం హైడ్ చేయగలరు.
- బయోమెట్రిక్ లాక్ / అన్‌లాక్: ఆధార్ బయోమెట్రిక్ డేటాను యాప్ ద్వారానే లాక్ చేయడం లేదా అన్‌లాక్ చేయడం సాధ్యమవుతుంది.
- ఫేస్ ఆథెంటికేషన్ సదుపాయం: ఈ కొత్త యాప్‌లో ముఖ గుర్తింపు (Face Authentication) ఫీచర్ కూడా అందుబాటులో ఉంది, దీని ద్వారా భద్రత మరింత బలోపేతం అవుతుంది.
- సురక్షిత డేటా స్టోరేజ్: ఆధార్ డేటా గోప్యతను కాపాడేందుకు యాప్ అధునాతన సెక్యూరిటీ ప్రోటోకాళ్లను ఉపయోగిస్తోంది.
UIDAI ఈ యాప్ ద్వారా ఆధార్ సంబంధిత సేవలను మరింత సురక్షితంగా, వేగంగా, పారదర్శకంగా అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: