📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు నర్సాపూర్‌–చెన్నై వందే భారత్‌ ప్రారంభం.. ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest news: UIDAI: వృద్ధులు, దివ్యాంగులకు శుభవార్త.. ఇంట్లోనే ఆధార్ అప్‌డేట్

Author Icon By Tejaswini Y
Updated: December 13, 2025 • 5:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంటి వద్దకే ఆధార్ సేవలు.. ఉడాయ్ కీలక నిర్ణయం

UIDAI: ఆధార్ కార్డు ఇప్పుడు బ్యాంకింగ్ నుంచి ప్రభుత్వ సంక్షేమ పథకాల వరకు ప్రతి అవసరానికీ తప్పనిసరిగా మారింది. విద్యా సంస్థల్లో అడ్మిషన్లు, రిజర్వేషన్లు, గుర్తింపు అవసరమైన అన్ని ప్రక్రియల్లో ఆధార్ కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పటికే ఆధార్(Aadhaar) సేవలను మరింత సులభతరం చేస్తూ ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌లు, సవరణలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంటూ, ఇంటి వద్దకే ఆధార్ సేవలను అందించే విధానాన్ని అధికారులు ప్రారంభించారు.

Read Also: Delhi Pollution:వాయు కాలుష్య ముప్పు: 18 ప్రాంతాల్లో ప్రమాద స్థాయికి AQI

ఆధార్ కోసం ఇక కేంద్రాలకు వెళ్లాల్సిన పనిలేదు

ఈ కొత్త సౌకర్యం ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, మంచానికే పరిమితమైన వారికి ఉపయోగపడనుంది. ఇకపై ఇలాంటి వారు ఆధార్ నమోదు లేదా అప్‌డేట్ కోసం కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. ముందుగా వారి కుటుంబ సభ్యులు ఉడాయ్ (Unique Identification Authority of India) ప్రాంతీయ కార్యాలయంలో దరఖాస్తు చేస్తే, ప్రత్యేక సిబ్బంది ఇంటికే వచ్చి ఆధార్‌కు సంబంధించిన వివరాలను నమోదు చేస్తారు. ఈ సేవలకు అర్హులుగా వృద్ధులు, శారీరకంగా బలహీనులు, దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారిని గుర్తించారు.

ఏపీ, తెలంగాణ ప్రజలకు ఇంటివద్ద ఆధార్ అప్‌డేట్ అవకాశం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన ఉడాయ్ ప్రాంతీయ కార్యాలయం హైదరాబాద్ అమీర్‌పేటలోని మైత్రీవనంలో ఉంది. ఇంటివద్ద ఆధార్ సేవలు పొందాలంటే దరఖాస్తులో సంబంధిత వ్యక్తి వయసు, ఆరోగ్య పరిస్థితి, ఆధార్ అప్‌డేట్ అవసరం వంటి పూర్తి వివరాలను పొందుపరచాలి. కార్యాలయానికి రాలేని పరిస్థితిని స్పష్టంగా చూపించే ఫొటోతో పాటు, వైద్యులు జారీ చేసిన మెడికల్ సర్టిఫికెట్‌ను కూడా జతచేయాలి. ఒక ఫొటో, మరో గుర్తింపు కార్డు ప్రతులు సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తు అందిన తర్వాత ఉడాయ్ సిబ్బంది సుమారు ఏడు రోజుల పాటు పరిశీలన చేపట్టి, అనంతరం ఇంటికి వచ్చి ఆధార్ సమస్యలను పరిష్కరిస్తారు. ఈ సేవకు దూరం ఎంత ఉన్నా సంబంధం లేకుండా రూ.700 ఫీజు వసూలు చేస్తామని అధికారులు వెల్లడించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

Aadhaar Card Aadhaar Home Service Aadhaar Registration Aadhaar Update UIDAI India UIDAI Services

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.