UIDAI: వాట్సాప్‌లోనే ఈ-ఆధార్ డౌన్‌లోడ్.. కొత్త సర్వీస్!

Read Time:  1 min
UIDAI: వాట్సాప్‌లోనే ఈ-ఆధార్ డౌన్‌లోడ్.. కొత్త సర్వీస్!
FONT SIZE
GET APP

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) మరియు MyGov సంయుక్తంగా ఆధార్ వినియోగదారులకు ఒక తీపి కబురు అందించాయి. ఇకపై మీ ఆధార్ కార్డును ఫిజికల్ కాపీగా వెంట తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అత్యవసర సమయాల్లో మీ మొబైల్ నుంచే వాట్సాప్ ద్వారా క్షణాల్లో ఇ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం కల్పించింది.

Read Also: Supreme Court: ఇంటి పనుల్లో భర్తకూ భాగస్వామ్యం ఉండాలి

UIDAI: Download e-Aadhaar on WhatsApp.. New service!
UIDAI: Download e-Aadhaar on WhatsApp.. New service!

కావాల్సిన అర్హతలు

ఈ సేవను పొందడానికి వినియోగదారుల వద్ద ఈ క్రింది వివరాలు ఉండాలి:

  1. మీ మొబైల్ నంబర్ తప్పనిసరిగా ఆధార్‌తో అనుసంధానించబడి ఉండాలి.
  2. మీకు యాక్టివ్ డిజిలాకర్ (DigiLocker) ఖాతా ఉండాలి.
  3. మీ 12 అంకెల ఆధార్ నంబర్ తెలిసి ఉండాలి.

డౌన్‌లోడ్ చేసుకునే విధానం

  • మొదట మీ ఫోన్‌లో MyGov హెల్ప్‌డెస్క్ నంబర్ +91-90131-51515 ను సేవ్ చేసుకోండి.
  • వాట్సాప్ ఓపెన్ చేసి ఆ నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్ పంపండి.
  • అక్కడ వచ్చే ఆప్షన్లలో ‘డిజిలాకర్ సేవలు’ (DigiLocker Services) ను ఎంచుకోండి.
  • ఆ తర్వాత మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ని ధృవీకరించిన వెంటనే, మీ ఇ-ఆధార్ PDF రూపంలో మీకు అందుతుంది.

ఈ సేవ పూర్తిగా ఉచితం మాత్రమే కాదు, చట్టబద్ధంగా అన్ని చోట్లా ఒరిజినల్ ఆధార్ లాగే చెల్లుబాటు అవుతుందని అధికారులు స్పష్టం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.