📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu News: Super Features: టీవీఎస్ నుంచి కొత్త అడ్వెంచర్ బైక్!

Author Icon By Vanipushpa
Updated: October 22, 2025 • 4:05 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

టీవీఎస్(TVS) అపాచీ ఆర్‌టీఎక్స్‌ 300 (TVS Apache RTX 300) పేరుతో లాంచ్ అయిన ఈ బైక్.. టీవీఎస్ నుంచి వస్తున్న తొలి అడ్వెంచర్ మోటర్ సైకిల్. ఇది KTM 250 అడ్వెంచర్‌, Yezdi అడ్వెంచర్‌, రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ Himalayan వంటి బైక్‌లకు పోటీగా నిలువనుంది. ఇప్పటికే అపాచీ సిరీస్ కు మార్కెట్లో మంచి పేరు ఉంది. ఇప్పుడు అడ్వెంచర్ మార్కెట్లోకి అడుగుపెట్టనుండడంతో ఈ బైక్ కు మంచి క్రేజ్ లభించే అవకాశం ఉంది. ఈ బైక్ లేటెస్ట్ ఫీచర్లు, శక్తివంతమైన ఇంజిన్ తోపాటు డిజైన్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అడ్వెంచర్ ప్రేమికులకు ఈ బైక్ బాగా నచ్చుతుందని కంపెనీ అభిప్రాయపడుతోంది.

Read Also: AP Crime: బాలిక పై టీడీపీ నేత అత్యాచారం..దేహశుద్ధి చేసిన గ్రామస్తులు

Super Features

అదిరిపోయే బైక్ ఫీచర్స్

ఇందులో 299 సీసీ లిక్విడ్‌-ఆయిల్ కూల్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ RT-XD4 ఇంజిన్‌ ఉంది. ఇది 35.5 హెచ్‌పీ పవర్‌, 28.5 ఎంఎన్‌ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఇందులో 6-స్పీడ్‌ గేర్‌ బాక్స్‌తో పని చేస్తుంది. బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్‌, స్లిప్పర్ క్లచ్‌ వంటి ఫీచర్స్ తో వస్తోంది. ఇందులో మోనోట్యూబ్ రియర్ సస్పెన్షన్ ఉంటుంది. అడ్వెంచర్ రైడ్స్ కు వీలుగా హై గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. ఫ్రంట్ 19 ఇంచ్ ట్యూబ్ లెస్ టైర్స్, బ్యాక్ 17 ఇంచ్ ట్యూబ్ లెస్ టైర్స్ ఉంటాయి.

ధరలు సుమారు రూ.2 లక్షల నుంచి

ఇకపోతే ఈ బైక్ వెయిట్ 180 కేజీలు ఉంటుంది. సీట్ హైట్ 835 ఎంఎం, గ్రౌండ్ క్లియరెన్స్ 200 ఎంఎం ఉంటాయి. ABS బ్రేకింగ్ సిస్టమ్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్స్ ఉంటాయి. వీటితోపాటు మ్యాప్‌ మిర్రరింగ్, GoPro కంట్రోల్‌, కాల్‌-ఎస్సెమ్మెస్ అలర్ట్స్ వంటి కనెక్టివిటీ ఫీచర్స్ ఉంటాయి. టూర్‌, ర్యాలీ, అర్బన్‌, రైన్‌ వంటి నాలుగు రైడ్ మోడ్‌లు ఉంటాయి. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 12.5 లీటర్లు ఉంటుంది. మైలేజ్ లీటర్ కు సుమారు 30 కిలోమీటర్లు ఇస్తుంది. ధరలు సుమారు రూ.2 లక్షల నుంచి ప్రారంభమవుతాయి.


టీవీఎస్ బైక్ మైలేజ్ ఎంత?

ARAI ప్రకారం స్కూటీ పెప్ ప్లస్ మైలేజ్ లీటర్ కు 68 కి.మీ .. టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ ఇంధన సామర్థ్యం లీటర్ కు 50 కి.మీ.

స్కూటీ పెప్ ఎత్తు మరియు బరువు ఎంత?

టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ పొడవు 1,760mm, వెడల్పు 635mm మరియు ఎత్తు 1,075mm . ఈ స్కూటర్ బరువు దాదాపు 93 కిలోలు, ఇది మార్కెట్లో లభించే అత్యంత తేలికైన స్కూటర్లలో ఒకటిగా నిలిచింది.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also:

Adventure Bike Latest News Breaking News Motorcycle Launch New Bike Launch Telugu News TVS Adventure Series TVS Motors Two-Wheeler News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.