📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? అంబా విలాస్ ప్యాలెస్ సమీపంలో పేలుడు.. ఒకరు మృతి చిరిగిన, మురికైన నోట్లపై ఆర్బీఐ స్పష్టత సంక్రాంతి పండుగ.. ఆరు ప్రత్యేక సర్వీసులు ప్రకటించిన రైల్వే

Latest News: Vijay: తొక్కిసలాటపై స్పందించిన టీవీకే అధినేత విజయ్

Author Icon By Anusha
Updated: September 28, 2025 • 11:34 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కరూర్ జిల్లా (Karur District) లో శనివారం సాయంత్రం జరిగిన ఘోరమైన తొక్కిసలాట ఘటనను ప్రజలు ఇంకా మరిచిపోలేదు. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 39 మంది ప్రాణాలను కోల్పోయారు, వీరిలో 10 మంది చిన్నారులు, 17 మంది మహిళలు ఉన్నారు. ఈ విషాదం రాజకీయ, సామాజిక, మానవతా పరంగా భారీ ఆందోళనలను సృష్టించింది. అన్ని వర్గాల ప్రజలు, రాజకీయ నాయకులు,మీడియా ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు.

 Sanjana: డ్రగ్స్ ఆరోపణలు – సంజనా గల్రానీపై సుప్రీంకోర్టు కొత్త చర్య

తొక్కిసలాటపై స్పందించిన టీవీకే అధినేత విజయ్ (Vijay), తొక్కిసలాట వార్తలు వెలువడిన కొన్ని గంటల తర్వాత ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. అందులోనే “నా గుండె ముక్కలైంది. మాటల్లో చెప్పలేని, భరించలేని దుఃఖం, బాధతో కుమిలిపోతున్నాను” అని ఆయన రాసుకొచ్చారు. “కరూర్‌లో ప్రాణాలు కోల్పోయిన నా ప్రియమైన సోదరసోదరీమణుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను” అని ఆయన అందులో పేర్కొన్నారు.

వాస్తవానికి టీవీకే అధినేత (Head of TVK) మధ్యాహ్నం 12 గంటలకే కరూర్ చేరుకోవాల్సి ఉంది. కానీ ఆయన దాదాపు ఆరు గంటలు ఆలస్యంగా వచ్చారు. అప్పటికే ఆయన్ను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. ఆయన ప్రయాణిస్తున్న ప్రచార బస్సు కూడా రోడ్డుపై వెళ్లడానికి స్థలం లేనంతగా జనసమూహం పెరిగిపోయింది.

(DMK) ప్రతినిధి శరవణన్ అన్నాదురై ఇది నిర్వాహకుల ఉద్దేశపూర్వక కుట్ర అని ఆరోపించారు.

ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన డీఎంకే (DMK) ప్రతినిధి శరవణన్ అన్నాదురై ఇది నిర్వాహకుల ఉద్దేశపూర్వక కుట్ర అని ఆరోపించారు. “ఈ కార్యక్రమం ఒక నిర్దిష్ట సమయంలో ప్రారంభం కావాలని విజయ్ స్పష్టంగా చెప్పినప్పటికీ.. అది జరగలేదు.

ప్రజలు దాదాపు ఆరు గంటలు వేచి ఉన్నారు. నిర్వాహకులు ఎందుకు ఇలా చేశారు? జనసమూహాన్ని మరింత ఎక్కువగా సమీకరించడానికి వారు ఈ చవకబారు వ్యూహాన్ని ఉపయోగించారు. ఇది నిర్వాహకుల నేరపూరిత నిర్లక్ష్యం” అని ఆయన మీడియాకు తెలిపారు.

View this post on Instagram

A post shared by TVK Vijay (@tvkvijayhq)

విజయ్ కూడా దీనికి బాధ్యుడు

అంతేకాకుండా “ఈ దుర్ఘటనకు ఎవరు బాధ్యత వహిస్తారో.. వారిని అరెస్టు చేయాలి. విజయ్ కూడా దీనికి బాధ్యుడు. ఆయన బాధ్యత నుంచి తప్పించుకోలేరు” అని ఆయన గట్టిగా నొక్కి చెప్పారు.ఈ విషాద ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ (M.K.Stalin) కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 10 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు.

ఈ ఘటనపై విచారణ జరపడానికి.. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి అరుణ జగదీశన్ నేతృత్వంలో ఒక ఏకసభ్య విచారణ కమిషన్‌ (Commission of Inquiry) ను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. “ఈ అమూల్యమైన ప్రాణాల నష్టం మనందరి హృదయాలను కలచివేసింది. ఈ తీరని నష్టాన్ని అనుభవించిన కుటుంబాలకు నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.

ఆసుపత్రుల్లో చేరిన వారికి అత్యుత్తమ వైద్యం అందించాలని నేను ఆదేశించాను. ఈ రాత్రి నేను కరూర్‌కు వెళ్లి మృతుల కుటుంబాలను కలుసుకుని, వారికి సానుభూతి తెలియజేస్తాను. అలాగే ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న వారిని కూడా సందర్శిస్తాను” అని ముఖ్యమంత్రి తన ప్రకటనలో తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Breaking News children and women victims crowd disaster karur stampede latest news political rally accident public mourning Tamil Nadu tragedy Telugu News tvk leader vijay response

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.