Thalapathy Vijay: TVK చీఫ్ విజయ్ కు కోర్టులో ఎదురుదెబ్బ

Read Time:  1 min
Thalapathy Vijay: TVK చీఫ్ విజయ్ కు కోర్టులో ఎదురుదెబ్బ
FONT SIZE
GET APP

నటుడు, టీవీకే అధినేత విజయ్ (Thalapathy Vijay) ఆదాయపు పన్ను శాఖ విధించిన పెనాల్టీకి వ్యతిరేకంగా మద్రాసు హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం ఆయన పిటిషన్‌ను కొట్టేసింది. 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.1.50 కోట్ల జరిమానా చెల్లించాలని ఐటీ శాఖ నోటీసులు ఇవ్వగా, దీనిపై 2022లో విజయ్ హైకోర్టును ఆశ్రయించారు.

Read Also: Euphoria: ‘యుఫోరియా’ మూవీ రివ్యూ

పెనాల్టీని చెల్లించాల్సిందే

అప్పట్లో విడుదలైన పులి సినిమాకు తీసుకున్న పారితోషికాన్ని తగ్గించి చూపారని పేర్కొంది. ఆ సినిమాకు రూ.15 కోట్లు పారితోషికంగా విజయ్ అందుకున్నారని, అందులో రూ.5 కోట్లను నగదు రూపంలో తీసుకున్నారని అధికారులు తెలిపారు. ఈ మొత్తాన్ని లెక్కల్లో చూపకుండా ఆదాయపు పన్ను ఎగ్గొట్టారని ఆరోపించారు.

TVK chief Vijay faces setback in court
TVK chief Vijay faces setback in court

శాఖాపరమైన దర్యాప్తులో ఈ విషయం తేలడంతో విజయ్ (Thalapathy Vijay) కు ఆదాయపు పన్ను శాఖ రూ.1.5 కోట్ల పెనాల్టీ విధించింది.ఈ పెనాల్టీని రద్దు చేయాలంటూ విజయ్ మద్రాస్ హైకోర్టులో అప్పీల్ చేసుకున్నారు. దీనిపై సుదీర్ఘ విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు గత నెల 23న తీర్పు రిజర్వు చేసింది. ఈ రోజు ఉదయం తీర్పు వెలువరిస్తూ.. ఆదాయపు పన్ను శాఖ విధించిన రూ.1.5 కోట్ల పెనాల్టీని చెల్లించాల్సిందేనని స్పష్టం చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.