📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ బంగారం ఆగడం లేదు, వెండి తొమ్మిది రోజుల్లో షాక్ పెరుగుదల! పార్టీ ఫిరాయింపుల కేసు.. స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్

Latest Telugu News : TVK chief Vijay : కేంద్రానికి ప్రభుత్వానికి మాత్రమే తమిళనాడు, పుదుచ్చేరి వేర్వేరు : విజయ్‌

Author Icon By Sudha
Updated: December 9, 2025 • 3:31 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే తమిళనాడు, పుదుచ్చేరి వేర్వేరు అని, తాము మాత్రం అందరం కలిసే ఉన్నామని నటుడు, టీవీకే చీఫ్‌ విజయ్‌ (TVK chief Vijay) అన్నారు. పుదుచ్చేరిలోని ఉప్పాలం లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఆయన ప్రసంగించారు. కరూర్‌ తొక్కిసలాట అనంతరం జరిగిన ఈ తొలి బహిరంగసభలో ఆయన.. తమిళనాడులోని డీఎంకే సర్కారు పై తీవ్ర విమర్శలు చేశారు. పుదుచ్చేరికి మద్దతు ఇవ్వడం తన బాధ్యత అని విజయ్‌(TVK chief Vijay) పేర్కొన్నారు. సీఎం రంగసామి నేతృత్వంలోని అక్కడి ప్రభుత్వం డీఎంకే ప్రభుత్వం వంటిది కాదని, ప్రతిపక్ష పార్టీలతోనూ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నదని మెచ్చుకున్నారు. మాకు ప్రత్యర్థి అయినా మా పార్టీ నిర్వహిస్తున్న ర్యాలీకి అడగగానే భద్రత రంగస్వామి ప్రభుత్వం కల్పించిందని తెలిపారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్ర పాలనకు సంబంధించిన విషయాలను పుదుచ్చేరి ప్రభుత్వం నుంచి నేర్చుకోవాలని సూచించారు.

Read Also : Vijay: విజయ్ సభ వద్దకు తుపాకీతో వచ్చిన వ్యక్తి..

TVK chief Vijay

కానీ ఆయన (స్టాలిన్‌) ఎప్పటికీ నేర్చుకోరని విజయ్‌ వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. మాజీ సీఎం, దివంగత ఎంజీ రామచంద్రన్‌కు పుదుచ్చేరితో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేస్తూ.. పుదుచ్చేరికి పూర్తి రాష్ట్ర హోదా ఇవ్వాలని పునరుద్ఘాటించారు. తమకు రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నో సంవత్సరాల నుంచి 16 తీర్మానాలను ప్రవేశపెట్టినా కేంద్రం పట్టించుకోవట్లేదని విమర్శించారు.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

Breaking News latest news Political News Puducherry Tamil Nadu Politics Telugu News TVK vijay

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.