సునామీలను నివారించడం సాధ్యం కానప్పటికీ, అత్యవసర సంసిద్ధత, సమయానుకూల హెచ్చరికలు, సమ ర్థవంతమైన ప్రతిస్పందన, ప్రభుత్వ సహాయం ద్వారా వాటి ప్రభావాన్ని మనం తగ్గించవచ్చు. 2004 డిసెంబర్ 26న హిందూ మహాసముద్రంలో, ఇండోనేషియాలోని ఉత్తర సు మత్రా పశ్చిమ తీరంలో గల సిమెలుయే ద్వీపానికి ఉత్తరాన 6.8 నుంచి 9.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంపం సృష్టించిన సునామీ 18 మీటర్ల (55.8 అడుగులు)ఎత్తు అలలతో ఇండోనేషియా, శ్రీలంక, థాయ్లాండ్, దక్షిణ భారతదేశం, టాంజానియా వరకు విధ్వంసం సృష్టిం చింది. 1964లో అలాస్కాలో 9.2 తీవ్రతతో సంభవించిన గుడ్ ఫ్రైడే భూకంపం తర్వాత ఇదే అతిపెద్ద భూకంపం. ఈ సంఘటన 21వ శతాబ్దంలో సంభవించిన మొదటి పెద్ద ప్రపంచ విపత్తుగా చరిత్రలో అత్యంత ఘోరమైన విపత్తులలో ఒకటిగా నిలిచిపోయింది. ఈ విపత్తులో అధికారిక లెక్కల ప్రకారం మన దేశంలో 10,136మంది మరణిం చారు. వీరిలో అత్యధిక మరణాలు తమిళనాడులో నమోదయ్యాయి. ఈ తీవ్రతను దృష్టిలో ఉంచుకొని, సునామీల (Tsunami ) పట్ల అవగాహన, సంసిద్ధత, ముందస్తు హెచ్చరిక, ప్రమాదకర ప్రభావాల ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచే లక్ష్యంతో 2015 డిసెంబరులో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ నవంబర్ 5ను ప్రపంచ సునామీ (Tsunami )అవగాహన దినంగా గుర్తించింది. సునామీలపై ప్రజలందరికీ అవగాహన ఉండాలి. ఎందుకంటే 1998 నుండి 2018 మధ్య సునా మీల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇరవై వేల కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. తీరప్రాంతాల్లో జనాభా
అధికమవడం, సముద్ర మట్టం పెరుగుదల వంటి ఉమ్మడి ప్రభావాల కార ణంగా భవిష్యత్తులో సునామీ మరణాల సంఖ్య ఇంకాపెరిగే అవకాశం ఉంది.
Read Also : India: ఢిల్లీ వాయు కాలుష్యం పై సాయంకు సిద్ధమన్న చైనా
‘నామి’ అంటే తరంగం
ప్రపంచ సునామీ అవగాహన దినం అనేది జపాన్ మేధోమథనం నుంచి పుట్టింది. సునామీల ముప్పు ఉన్న దేశాలు వారివారి దేశాల ప్రజల తరలింపు మార్గా లను, కొత్త హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేయాలని, పిల్లలు యువతలో అవగాహన పెంచాలని వైపరీత్యాల ప్రమాదాలను తగ్గించే ఐక్యరాజ్యసమితి కార్యాలయం (యుఎన్డిడిఆర్ యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్) కోరుతోంది. ‘సునామీ’ అనే పదం జపనీస్ భాష నుండి ఉద్భవించింది. ఇందులో ‘త్సు’ అంటే నౌకా శ్రయం, ‘నామి’ అంటే తరంగం అని అర్థం. సునామీ అనేది సాధారణంగా సముద్రం క్రింద లేదా సమీపంలో సంభవించే భూకంపాలతో సంబంధం ఉండి నీటి అడుగున అంతరాయం సృష్టించే భారీ తరంగాల శ్రేణిని సూచిస్తుంది. మహాసముద్రాలలో నీటి స్థానభ్రంశం ద్వారా సునామీలు ఉత్పన్నమవుతాయి. భూకంపం సమయంలో సముద్రపు అడుగుభాగంలో ఉన్న టెక్టోనిక్ ప్లేట్ల కదలిక ద్వారా ఇవి సాధారణంగా సృష్టిం చబడతాయి. అయినప్పటికీ, అగ్నిపర్వత విస్ఫోటనాలు, హిమనదీయ శిల్పాలపతనం, ఉల్క ప్రభావాలు లేదా కొండచరియలు విరిగిపడటం వల్ల కూడా ఇవి సంభవించవచ్చు. అయితే అన్ని భూకంపాలు సునామీలకు కారణంకావు. భూకంపం సునామీని సృష్టించడానికి నాలుగు ముఖ్యమైన షరతులు అవసరమని నిపుణులు చెబుతున్నారు. ఇందులో మొదటది, భూకంపం సముద్రం అడుగున సంభవించాలి. రెండు, రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత కనీసం 6.5గా నమోదవ్వాలి. మూడు, భూకంపంతో భూమి ఉపరితలం చీలిపోవాలి. నాలుగు, భూకంప కేంద్రం భూమి ఉపరితలం నుంచి ౭౦ కిలోమీటర్ల కంటే తక్కువ లోతులో ఉండాలి.
అత్యంత విధ్వంసకర సునామీ
1883 ఆగస్టు 26న ఇండోనేషియాలోని క్రాకటౌ అగ్నిపర్వత విస్ఫోటనం అత్యంత విధ్వంసకర సునామీని సృష్టించింది. ఈ పేలుడు కారణంగా 135 అడుగుల ఎత్తుకు అలలు ఎగిసిపడగా, జావా, సుమత్రా దీవుల్లోని సుందా జలసంధి వెంబడి తీరప్రాంత పట్టణాలు, గ్రామాలు ధ్వంస మయ్యాయి. సుమారు 36,417 మంది మరణించారు. ఇటీవలి చరిత్రలో ఉల్కలు లేదా గ్రహశకల ప్రేరిత సునా మీలు నమోదు కానప్పటికీ ఈఖగోళ వస్తువులు సముద్రాన్ని తాకితే నిస్సందేహంగా పెద్ద మొత్తంలో నీరు స్థానభ్రంశం చెంది సునామీని సృష్టిస్తుందని శాస్త్రవేత్తలు నొక్కి చెబుతు న్నారు. తీరప్రాంతాల్లోని లోతట్టు (ప్రాంతాలలో అధిక జనాభా కేంద్రీకృతమై ఉండటం వలన, వీరు సునామీల ప్రమాదాలకు ఎక్కువగా గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా లోతట్టు తీరప్రాంతాలు, చిన్న ద్వీపాలు, అభివృద్ధి చెందు తున్న దేశాలలో 70 కోట్లకు పైగా ప్రజలు సునామీలతో సహా తీవ్రమైన సముద్రమట్ట సంఘటనలకు గురవుతున్నా రని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేష న్ 2019 తెలిపింది. సునామీ ప్రమాదం గురించి, అత్యవసర పరిస్థితుల్లో ఏమి చేయాలో ప్రజలకు తెలిసినప్పుడు మాత్రమే ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ప్రభావవంతంగా పనిచేస్తుందని యునెస్కో 2022 నివేదిక నివేదించింది. 2004 హిందూ మహాసముద్రసునామీ దుర్ఘటన ఫలితంగా హిందూ మహాసముద్ర పరీవాహక ప్రాం తంలోని 27 దేశాలకు ప్రయోజనం చేకూర్చే సునామీ ముం దస్తు హెచ్చరిక వ్యవస్థ సృష్టికి దారితీసింది. ఇంటర్ గవర్న మెంటల్ ఓషనోగ్రాఫిక్ కమిషన్ (ఐఓసీ) యునెస్కో సమన్వయంతో రూపొందించిన గ్లోబల్ సునామీ వార్నింగ్ సిస్టం ప్రాణాలను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఐఓసి యునెస్కో సునామీ కార్యక్రమం, సునామీ సర్వీస్ పొవైడర్లు, సమాచార కేంద్రాల మద్దతుతో, సునామీ ప్రమాదాన్ని అంచనా వేయడంలో, సునామీ ముందస్తు హెచ్చరిక వ్యవ స్థలను (ఇడబ్ల్యుఎస్) అమలు చేయడంలో ప్రమాదంలో ఉన్న కమ్యూనిటీలకు సంసిద్ధత చర్యల గురించి అవగాహన కల్పించడంలో సభ్యదేశాలకు మద్దతుఇస్తుంది. భారత ప్రభు త్వం భారత సునామీ ముందస్తు వాచ్చరిక కేంద్రాన్ని హైద రాబాద్లో అక్టోబర్ 2007 నుండి నిజ సమయ భూకంప పర్యవేక్షణ, సముద్రమట్ట టైడ్ గేజ్ల నెట్వర్క్ 24 గంట లూ పనిచేసే విధంగా నెలకొల్పబడింది.
ముందస్తు హెచ్చరిక
సునామీసంసిద్ధతా కార్యక్రమం అనేది ఒక బహుళ స్థాయి కార్యక్రమం. సునా మీ ప్రమాదం గురించి, అత్యవసర పరిస్థితుల్లో ఏమి చేయా లో ప్రజలకుతెలిసినప్పుడే ముందస్తు హెచ్చరిక వ్యవస్థ ప్రభావ వంతంగా ఉంటుందనే సూత్రంపై ఇది ఆధారపడి ఉంది. సునామీ సంసిద్ధత ప్రామాణిక స్థాయిని చేరుకోవడానికి సహకార ప్రయత్నం ద్వారా ఇది సాధించబడుతుంది. ఈ కార్యక్రమం స్వచ్ఛందంగా ఆధారిత కమ్యూనిటీ పని తీరుగుర్తింపు కార్యక్రమంగా అమలు చేయబడుతుంది. ఇది జాతీయ, స్థానిక హెచ్చరిక, అత్యవసర నిర్వహణ సంస్థలు, ప్రభుత్వ అధికారులు, శాస్త్రవేత్తలు, కమ్యూనిటీ నాయకులు, ప్రజల మధ్య క్రియాశీల సహకారంగా సంసిద్ధతభావనను అర్థంచేసుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది. జాతీయస్థాయిలో ఈ కార్యక్రమానికి జాతీయ విధానం, యంత్రాంగం మద్దతు ఇవ్వాలి. ఇక మనదేశంలో చూస్తే ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ నేషనల్ సునామీ రెడీబోర్డును ఏర్పాటు చేసింది. ఒడిషా రాష్ట్రంలోని వెంకట్రాయిపూర్, నోలియాసాహి గ్రామాలు మన దేశంలో మొట్టమొదటి హిందూ మహాసముద్ర సునామీ రెడీ కమ్యూనిటీలుగా ఉన్నాయి. హిందూ మహా సముద్ర ప్రాంతానికి ఉన్న మూడు సునామీ సర్వీస్ ప్రొవైడర్లలో భారతదేశం ఒకటిగా పనిచేస్తుంది.
-డి. జయరాం
భారతదేశంలో సునామీలు ఎన్నిసార్లు వచ్చాయి?
భారతదేశం దాని నమోదిత చరిత్రలో అనేక సునామీల ప్రభావానికి గురైంది, వాటిలో అత్యంత వినాశకరమైనది 2004లో సంభవించింది, దీనివల్ల గణనీయమైన ప్రాణనష్టం మరియు ఆస్తి నష్టం జరిగింది. “సునామీ సంఘటన” యొక్క విభిన్న నిర్వచనాల కారణంగా ఖచ్చితమైన సంఖ్యను గుర్తించడం కష్టమే అయినప్పటికీ, కొన్ని వర్గాలు 1762 నుండి మరణాలకు కారణమైన ఎనిమిది ప్రధాన సునామీ సంఘటనలను ఉదహరిస్తున్నాయి.
2004 సునామీలో ఎంత మంది భారతీయులు మరణించారు?
అధికారిక భారత అంచనాల ప్రకారం, 2004 హిందూ మహాసముద్ర సునామీ భారతదేశంలో 10,749 మందిని చంపింది, వేలాది మంది గాయపడ్డారు, తప్పిపోయారు లేదా స్థానభ్రంశం చెందారు. ఇతర వనరులు కొద్దిగా భిన్నమైన గణాంకాలను అందిస్తున్నాయి, ఉదాహరణకు 10,000 కంటే ఎక్కువ మరణాలు లేదా OCHA నివేదిక నుండి 10,672 మంది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మరియు ఒరిస్సా రాష్ట్రాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి, వేలాది మంది, ప్రధానంగా మత్స్యకార వర్గాలు, తమ ప్రాణాలను మరియు ఇళ్లను కోల్పోయారు.
Read hindi news :hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also :