📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి భారీగా ఇండిగో విమానాలు రద్దు శ్రీలంక విపత్తులో వెలిసిన సేవా భావం గాజాలో సామూహిక వివాహాలు భారత్ లో పర్యటించనున్న పుతిన్ అమెరికా, యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య కీలక ఒప్పందం! భారీ వర్షాలతో ఇండోనేషియా అతలాకుతలం శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించిన ప్రభుత్వం థాయ్ లాండ్ లో వర్ష బీభత్సం..145 మంది మృతి హాంకాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం వైట్ హౌస్ సమీప కాల్పులు నేషనల్ గార్డ్ జవాన్ మృతి

భారత్‌పై ట్రంప్ ఒత్తిడి

Author Icon By Vanipushpa
Updated: January 29, 2025 • 12:55 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య ఫోన్‌ సంభాషణ జరిగింది. ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతం సహా అనేక అంశాలపై చర్చించుకున్నట్లు వైట్‌ హౌస్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది. అమెరికా నుంచి ఆయుధ కొనుగోళ్లు సహా బైలేటరల్‌ ట్రేడ్‌ వంటి అంశాలు సైతం ప్రస్తావనకు వచ్చినట్లు తెలిపింది. ఈ విషయంలో ట్రంప్, భారత్‌పై ఒత్తిడి పెడుతున్నట్లు తెలుస్తోంది. చర్చల్లో భాగంగా అమెరికా నుంచి డిఫెన్స్‌ ఎక్విప్‌మెంట్‌ కొనుగోలును పెంచుకోవాలని భారత్‌ను ట్రంప్‌ కోరినట్లు వైట్‌ హౌస్‌ స్వయంగా ప్రకటించింది. తద్వారా ఇరు దేశాల మధ్య ఫెయిర్‌ బైలేటరల్‌ ట్రేడింగ్‌ రిలేషన్‌షిప్‌ను నెలకొల్పాలని సూచించినట్లు తెలిపింది.

దీనివల్ల రెండు దేశాలకు ప్రయోజనం చేకూరుతుందని చెప్పినట్లు వెల్లడించింది. పొరుగుదేశం చైనా నుంచి భద్రతాపరంగా భారత్‌ అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆయుధ సంపత్తి, డిఫెన్స్‌ టెక్నాలజీలో చైనా చాలా అడ్వాన్స్‌గా ఉంది. ఈ నేపథ్యంలో భారత్‌ సైతం చైనాకు దీటుగా సైన్యం, సైనిక వ్యవస్థలను బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఆ దిశగా మోడ్రన్‌ డిఫెన్స్‌ ఎక్విప్‌మెంట్‌ను సమకూర్చుకోవాలని యోచిస్తోంది.

ఫైటర్‌ జెట్లు, సబ్‌మెరైన్లు, యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లు, అసాల్ట్‌ రైఫిళ్ల విషయంలో చాలా అప్‌గ్రేడ్‌ కావాల్సి ఉందన్న విషయాన్ని గుర్తించింది. డిఫెన్స్‌ టెక్నాలజీ విషయంలో చాలా వెనకబడి ఉండడం గమనించింది. అదే సమయంలో దేశీయంగానూ డిఫెన్స్‌ ఎక్విప్‌మెంట్‌, ఆయుధాల తయారీని నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఆ దిశగా పనిచేస్తున్న కంపెనీలకు సహకారం అందించాలని సైన్యానికి సూచించింది. మరోవైపు భారత్‌ సహా బ్రిక్స్‌ కూటమిలోని దేశాలు అమెరికా వస్తువులపై అధిక సుంకాలు విధిస్తున్నాయంటూ ట్రంప్‌ విరుచుకుపడ్డారు. ఇది అమెరికాకు హాని చేయడమేనని వ్యాఖ్యానించారు. అందుకు ప్రతీకారంగా తాము కూడా భారత్‌, చైనా, బ్రెజిల్‌ దేశాల వస్తువులు, సేవలపై 100% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు.

buy the weapons Donald Trump india Narendra Midi USA

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.