📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

US Trade: ట్రంప్ ట్రేడ్ ఇన్వెస్టిగేషన్: భారత్‌కు ఎదురుదెబ్బ.. అమెరికాతో వ్యాపారం కష్టమేనా?

Author Icon By Vanipushpa
Updated: March 12, 2026 • 1:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Trump) తన రెండో విడత పాలనలో స్వదేశీ పరిశ్రమలను కాపాడుకునేందుకు దూకుడు పెంచారు. విదేశీ పారిశ్రామిక ఉత్పత్తుల వల్ల అమెరికా మార్కెట్ దెబ్బతింటోందని భావిస్తున్న ట్రంప్ ప్రభుత్వం, బుధవారం నుంచి వాణిజ్య దర్యాప్తును ప్రారంభించింది. 1974 వాణిజ్య చట్టంలోని సెక్షన్ 301 కింద ఈ విచారణ జరుగుతోంది. గతంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని సాకుగా చూపి ట్రంప్ విధించిన టారిఫ్‌లను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసింది. దీంతో వెనక్కి తగ్గని ట్రంప్ యంత్రాంగం, ఇప్పుడు పక్కా చట్టబద్ధమైన పద్ధతిలో విచారణ చేపట్టి, ఆయా దేశాల నుంచి వచ్చే వస్తువులపై భారీగా సుంకాలు వేయడానికి సిద్ధమవుతోంది.

Israel Iran War: యుద్ధం ముగియాలంటే ఆ ‘మూడు’ షరతులకు తలొగ్గాల్సిందే.. ఇరాన్ సంచలన డిమాండ్లు!

US Trade: Trump Trade Investigation: A setback for India.. Is it difficult to do business with America?

అమెరికాతో అతిపెద్ద వాణిజ్య సంబంధాలు ఉన్న భారత్, చైనా

ఈ దర్యాప్తు కేవలం ఒక్క దేశానికే పరిమితం కాలేదు. అమెరికాతో అతిపెద్ద వాణిజ్య సంబంధాలు ఉన్న భారత్, చైనా, యూరోపియన్ యూనియన్, మెక్సికో, జపాన్, దక్షిణ కొరియా వంటి దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటితో పాటు ఆగ్నేయాసియా దేశాలైన వియత్నాం, థాయిలాండ్, బంగ్లాదేశ్ కూడా అమెరికా నిఘా నీడలోకి వచ్చాయి. అమెరికా వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ ప్రకారం.. అనేక దేశాలు తమ దేశీయ అవసరాల కంటే చాలా ఎక్కువగా వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాయి. భారత్ ఈ జాబితాలో ఉన్నప్పటికీ, ఇటీవలే ట్రంప్ ప్రభుత్వం భారత్‌కు ఒక పెద్ద ఊరటనిచ్చింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గించుకుంటామన్న హామీతో, భారత ఉత్పత్తులపై పన్నును 50% నుండి 18%కి తగ్గించారు. ఈ దర్యాప్తుతో అమెరికా, ఇండియా చేసుకున్న ట్రేడ్ డీల్ దెబ్బతింటుందనే సందేహాలు వ్యక్తమవుతు న్నాయి. అయినప్పటికీ, తాజా సెక్షన్ 301 దర్యాప్తు వల్ల భవిష్యత్తులో ఈ సమీకరణాలు ఎలా మారతాయో వేచి చూడాలి. “అమెరికా కార్మికులకు మేలు జరగాలి, ఇక్కడే ఉద్యోగాలు రావాలి” అనేది ట్రంప్ నినాదం.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Donald Trump Reciprocal Tax Impact on Indian Exports to US india us economic relations Telugu News Paper Telugu News Today Trump Tariff Policy Trump Trade Investigation India US India Trade War 2026 US Trade Representative Investigation

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.