📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Latest Telugu news : Punjab – పంజాబ్‌ స్ఫూర్తి అంటే ఇదే..

Author Icon By Sudha
Updated: September 3, 2025 • 5:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారీ వర్షాలు, వరదలతో ఉత్తర భారతం అతలాకుతలం అవుతున్నది. అనేక రాష్ట్రాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఢిల్లీ, జమ్ము కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, (Punjab) హర్యానా రాష్ట్రాల్లో కుంభవృష్టి కురిసింది. ఊర్లకు ఊర్లు చెరువులను తలపిస్తుండగా రోడ్లు నీటమునిగిపోయాయి. అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. డజన్ల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. ఇక ఇటీవలే కురిసిన వర్షాలకు పంజాబ్‌ (Punjab) రాష్ట్రం అతలాకుతలమైన విషయం తెలిసిందే.భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించడంతోపాటు డ్యాంల నుంచి నీటిని విడుదల చేయడంతో పంజాబ్‌ (Punjab) లోని 10కిపైగా జిల్లాలు వరదల్లో చిక్కుకున్నాయి. గడచిన 25 ఏళ్లలో మొట్టమొదటిసారి సాధారణం కన్నా 74 శాతం అధిక వర్షపాతం నమోదైంది. వారం రోజుల్లో 30 మందికిపైగా మరణించారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 23 జిల్లాల్లోని 1,300 గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం, పలు స్వచ్ఛంద సంస్థలు తమ వంతు సాయం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. నడుము లోతు నీటిలో వాలంటీర్లు బాధితులకు సాయంగా నిలుస్తున్నారు.

Punjab – పంజాబ్‌ స్ఫూర్తి అంటే ఇదే..

ఈ క్రమంలో తమకు సాయం చేసేందుకు వచ్చిన వాలంటీర్లకు ఓ వృద్ధుడు టీ అందించడం (Elderly Man Seen Serving Tea) అందరినీ ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను మాజీ క్రికెటర్‌, రాజ్యసభ సభ్యుడు హర్భజన్‌ సింగ్‌ తన ఎక్స్‌ ఖాతాలో పోస్టు చేశారు. వరదల్లో సర్వం కోల్పోయినా.. సాయం చేసేందుకు వచ్చిన వారికి ఓ కుటుంబం టీ అందించినట్లు పేర్కొన్నారు. పంజాబ్‌ స్ఫూర్తి అంటే ఇదే.. అంటూ వీడియోకి క్యాప్షన్‌గా రాసుకొచ్చారు. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌ అవుతోంది.

పంజాబీ దేనికి ప్రసిద్ధి చెందింది?

పంజాబీ సంస్కృతి భాంగ్రా మరియు గిద్దా వంటి ఉల్లాసమైన జానపద నృత్యాలకు, బటర్ చికెన్ మరియు దాల్ మఖానీ వంటి వంటకాలతో సహా దాని రుచికరమైన మరియు గొప్ప వంటకాలకు మరియు బైసాఖి మరియు లోహ్రీ వంటి ఉల్లాసమైన పండుగలకు ప్రసిద్ధి చెందింది, ఇది వ్యవసాయానికి లోతైన సంబంధాన్ని మరియు ఆతిథ్య భావాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ప్రాంతం అమృత్సర్‌లోని స్వర్ణ దేవాలయం మరియు దాని విలక్షణమైన ఫుల్కారీ ఎంబ్రాయిడరీ మరియు ఇతర కళలు మరియు చేతిపనుల మతపరమైన ప్రాముఖ్యతకు కూడా ప్రసిద్ధి చెందింది.

పంజాబీకి సంబంధించిన ఐదు విషయాలు ఏమిటి?

గురు గోవింద్ సింగ్ ఖల్సా సిక్కుల కోసం ఆదేశించిన ఐదు విశ్వాస అంశాలు: కేష్ (కత్తిరించని జుట్టు), కంఘా (చెక్క దువ్వెన), కారా (ఉక్కు బ్రాస్లెట్), కచేరా (పత్తి లోదుస్తులు) మరియు కిర్పాన్ (ఒక చిన్న కత్తి). ఇవి పంజాబీ సంస్కృతి యొక్క సాంస్కృతిక లేదా మతపరమైన అంశాలు మాత్రమే కాదు, కానీ అవి సిక్కు గుర్తింపు యొక్క విభిన్నమైన, పవిత్ర చిహ్నాలు మరియు ఖల్సా సిక్కులు అన్ని సమయాల్లో ధరిస్తారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/special-trains-dussehra-diwali-south-central-railway-extended-till-november-24/national/540754/

Breaking News India States inspiration latest news Punjab Punjab Culture Punjabi Spirit Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.