📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

TRF Terrorists : పహల్గాం దాడి నిందితుడు ఆసిఫ్ ఫౌజీ ‘ముజాహిద్దీన్’ అన్న సోదరి

Author Icon By Divya Vani M
Updated: April 26, 2025 • 3:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ వద్ద ఇటీవల జరిగిన ఉగ్రదాడి తర్వాత దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఈ దాడిలో పాల్గొన్నట్టు అనుమానిస్తున్న ముగ్గురు ఉగ్రవాదుల ఊహాచిత్రాలను దర్యాప్తు సంస్థలు విడుదల చేశాయి.వీరిని ఆసిఫ్‌ ఫౌజీ, సులేమాన్‌ షా, అబు తాలాలుగా గుర్తించారు. ఆసిఫ్ ఫౌజీ సోదరి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.తన సోదరుడు ఇలాంటి దారుణానికి పాల్పడతాడని ఊహించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఆసిఫ్ ఒక ముజాహిద్దీన్‌గా మారినట్లు తెలిపింది.ఇంకా, తమ మరొక సోదరుడు కూడా ప్రస్తుతం జైలులో ఉన్నాడని వెల్లడించింది. ట్రాల్ ప్రాంతంలో ఉన్న తమ ఇంటిని భద్రతా బలగాలు కూల్చేశాయని ఆమె పేర్కొంది.ఇది జరుగడంతో, వారు బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారని చెప్పింది. పహల్గామ్ ఘటన జరిగిన సమయంలో తాను అత్తగారింట్లో ఉన్నట్లు వివరించింది.

Pahalgam attack: Security agencies release sketches of three men

ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే స్వగ్రామానికి వచ్చానని తెలిపింది. అయితే అప్పటికే తల్లిదండ్రులు, చెల్లెళ్లు కనిపించకుండా పోయారని చెప్పింది.వారిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకుని ఉంటారని అనుమానం వ్యక్తం చేసింది. తన సోదరుడి ఉగ్ర చర్య గురించి తమకు ఎటువంటి సమాచారం లేదని స్పష్టం చేసింది.ఇక మరోవైపు, భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను తీవ్రతరం చేశాయి. లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన TRF సభ్యుల కోసం ప్రత్యేకంగా గాలిస్తున్నారు.ఈ క్రమంలో ఆసిఫ్ షేక్, ఆదిల్ థోకర్ ఇళ్లలో సోదాలు జరిపారు. అయితే, అక్కడ అమర్చిన ఐఈడీలు పేలిపోవడం కలకలం రేపింది.ఈ పేలుళ్ల ధాటికి ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి. అదృష్టవశాత్తూ భద్రతా సిబ్బంది ఎవరికీ గాయాలు కాలేదు.దీంతో పాటు, భద్రతా దళాలు ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లను పేల్చినట్లు సమాచారం. ఈ ఘటనలతో కశ్మీర్ లో మళ్లీ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా బలగాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదుల రాకపోకలను పూర్తిగా అడ్డుకునేందుకు చర్యలు కొనసాగుతున్నాయి.ఇక ప్రజల్లో కూడా భయం నెలకొని ఉంది. అయితే భద్రతా బలగాల నడిపిస్తున్న గాలింపు చర్యలు జోరందుకున్నాయి.

Read Also : Seema Haider : ప్లీజ్‌ న‌న్ను పాక్‌కు పంపొద్దు : సీమా హైద‌ర్‌

AsifFauji KashmirSecurity KashmirTensions KashmirTerrorAttack PahalgamAttack PahalgamTerrorInvestigation TRFTerrorists

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.