శబరిమల(Sabarimala)లో భక్తుల రద్దీ రోజురోజుకూ ఊహించని స్థాయికి చేరుతోంది. రోజుకు దాదాపు 90 వేలమందికి దర్శనం కల్పించాలన్న ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు నిర్ణయం ఉన్నప్పటికీ, వాస్తవానికి లక్ష మందికి పైగా భక్తులు అయ్యప్ప స్వామి దర్శనానికి తరలివస్తున్నారు. భారీగా పెరుగుతున్న జనసంచారాన్ని దృష్టిలో ఉంచుకుని బోర్డు కీలక చర్యలు తీసుకుంది.
భక్తుల ఒత్తిడి కారణంగా స్పాట్ బుకింగ్‌ను 5 వేల టికెట్లకే పరిమితం చేస్తూ దేవస్థానం బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. మకరవిళక్కు యాత్ర సీజన్ ప్రారంభమైన మొదటి రోజు నుంచే శబరిమల మార్గాలు కిక్కిరిసిపోయాయి. కేవలం మూడు రోజుల్లోనే మూడు లక్షలకు పైగా భక్తులు చేరుకోవడంతో పంబ–సన్నిధానం మార్గం పూర్తిగా నిండిపోయింది.
Read Also: Droupadi Murmu: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
గంటలకు పైగా వేచి ఉండాల్సి రావడం
అయ్యప్ప దర్శనానికి 16 గంటలకు పైగా వేచి ఉండాల్సి రావడం, కిలోమీటర్ల మేర క్యూలైన్లు ఏర్పడటం, ప్రాథమిక సౌకర్యాల(facilities) లోపంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు తోడు అనూహ్యంగా పెరిగిన రద్దీ కారణంగా పోలీసులు, దేవస్థానం సిబ్బంది పరిస్థితిని పూర్తిగా నియంత్రించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఏడు స్పాట్ బుకింగ్ కౌంటర్లు
స్పాట్ టికెట్ల కోసం పంబ వద్ద భారీ రద్దీ నెలకొనడంతో, రద్దీని తగ్గించేందుకు నీలక్కల్‌లో అదనంగా ఏడు స్పాట్ బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 24 వరకు మాత్రమే రోజుకు ఐదు వేల స్పాట్ బుకింగ్‌లు ఉంటాయని స్పష్టం చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: