Train Cancelled: భారీ వర్షాల కారణంగా ఒడిశాలోని రాయగడ డివిజన్‌లో కొండచరియలు విరిగిపడటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఎంవీజీ, సీటీఎస్ స్టేషన్ల మధ్య రైల్వే ట్రాక్‌పై కొండచరియలు పడటంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కిరండూల్-విశాఖపట్నం మధ్య నడిచే పలు రైళ్లను రద్దు చేయగా.. భువనేశ్వర్-జగదల్‌పూర్ మధ్య నడిచే మరికొన్ని రైళ్లను కోరాపుట్ వరకు మాత్రమే నడపాలని రైల్వే అధికారులు నిర్ణయించారు.
Read Also:Congress On CEC : సీఈసీ రాజీనామా, ఎస్‌ఐఆర్ నిలిపివేతకు కాంగ్రెస్ పిలుపు
కిరండూల్-విశాఖ రైళ్లు రద్దు
కొండచరియల కారణంగా కిరండూల్-విశాఖపట్నం మధ్య నడిచే 58502, 58501 ప్యాసింజర్ రైళ్లతో పాటు 18516, 18515 ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేశారు. ఈ రైళ్లు సెప్టెంబర్ 30, అక్టోబర్ 1 తేదీల్లో నడవవని రైల్వే అధికారులు తెలిపారు.
Train Cancelled: కోరాపుట్ వరకే ఎక్స్‌ప్రెస్ రైళ్లు
మరోవైపు భువనేశ్వర్-జగదల్‌పూర్ మధ్య నడిచే 18447, 18448 ఎక్స్‌ప్రెస్ రైళ్లను సెప్టెంబర్ 29, 30, అక్టోబర్ 1 తేదీల్లో జగదల్‌పూర్ వరకు కాకుండా కోరాపుట్ వరకు మాత్రమే నడపనున్నారు. రైల్వే మార్గంలో ఏర్పడిన పరిస్థితులను బట్టి రైళ్ల రాకపోకలపై తదుపరి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రయాణికులు తమ ప్రయాణ ప్రణాళికలను ముందుగానే మార్చుకోవాలని సౌత్ కోస్ట్ రైల్వే సూచించింది. రైలులో ప్రయాణించే ముందు సంబంధిత రైలు ప్రస్తుత స్థితిని ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవాలని కోరింది. కొండచరియలను తొలగించి రైల్వే మార్గాన్ని పునరుద్ధరించే పనులు పరిస్థితులను బట్టి కొనసాగనున్నాయి.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: