రాజస్థాన్‌లో విషాదం (Rajasthan tragedy) చోటు చేసుకుంది. టోంక్ (Tonk) జిల్లాలోని బనసా నది (Banas River)లో ఈతకు వెళ్లి ఎనిమిది మంది యువత ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురిని స్థానికులు రక్షించారు.
టోంక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వికాస్ సంగ్వాన్ తెలిపిన వివరాల ప్రకారం.. 25 నుంచి 30 ఏండ్ల మధ్య వయసున్న 11 మంది యువత మంగళవారం ఈత కొట్టేందుకు బనసా నదికి వెళ్లారు. అక్కడ నదిలోకి దిగి స్విమ్ చేస్తూ గల్లంతయ్యారు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన టోంక్ పోలీసులు.. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సాయంతో నదిలో మునిగిపోయిన వారిని రక్షించేందుకు ప్రయత్నించారు. ముగ్గురిని ప్రాణాలతో రక్షించగా.. ఎనిమిది మంది నీటిలో మునిగి మృతి చెందారు. మృతదేహాలను నదిలోనుంచి వెలికి తీసిన పోలీసులు అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Also :Singapore Container: సింగపూర్ కంటైనర్ షిప్లో అగ్నిప్రమాదం- నలుగురు గల్లంతు!