ఆటోమొబైల్ రంగంలో మరోసారి ధరల పెంపు వార్త వినియోగదారులకు షాక్ ఇస్తోంది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ మోటార్ తన కార్ల ధరల (Car Prices) ను గరిష్టంగా 1.98 శాతం వరకు పెంచనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ముడి సరుకుల ధరలు పెరగడమే దీనికి కారణమని కంపెనీ పేర్కొంది. గ్లాంజా, రూమియన్, అర్బన్ క్రూయిజర్ టైజర్, హైరైడర్, ఇన్నోవా హైక్రాస్, క్రిస్టా, ఫార్చ్యూనర్, హైలక్స్, ల్యాండ్ క్రూయిజర్ 300, క్యామ్రీ, వెల్‌ఫైర్ వంటి అన్ని మోడళ్ల ధరలు పెరిగాయి.
Read Also: Jithendra Singh: 2032 నాటికి 17 అణు విద్యుత్ రియాక్టర్ల నిర్మాణం
ధరల పెంపు
ఈ నిర్ణయం ఇప్పటికే బుకింగ్ చేసుకున్న కస్టమర్లపై కూడా ప్రభావం చూపనుంది. కొత్త కారు కొనుగోలుదారులు తాజా ధరల కోసం డీలర్‌ను సంప్రదించాలని సూచించారు.భారతదేశంలో ఇన్‌పుట్ ధర పెరుగుదల కారణంగా ఈ సంవత్సరం ధరల (Car Prices) పెంపును ప్రకటించిన మొదటి తయారీదారు టయోటా కాదు. టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, ఆడి, హ్యుందాయ్, ఎమ్ఐ మోటార్, మహీంద్రా, సిట్రోయెన్, బిఎమ్ఐడబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్, విడబ్ల్యూ, స్కోడా, సిట్రోయెన్ వంటి కార్ల తయారీ కంపెనీలు భారత మార్కెట్లో తమ ఉత్పత్తుల ధరలను పెంచాయి.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: