📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Top 10 Flight Accidents : వణికించిన టాప్ 10 విమాన ప్రమాదాలు

Author Icon By Divya Vani M
Updated: June 12, 2025 • 6:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుజరాత్‌ అహ్మదాబాద్‌లో (In Ahmedabad, Gujarat) గురువారం మధ్యాహ్నం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 242 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ విషాద ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది.ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ ఘటనలో 35 మంది మృతి (35 people died) చెందారు. గతంలో భారత్‌లో చోటుచేసుకున్న వివిధ విమాన ప్రమాదాలను ఇప్పుడు ఓసారి గుర్తుచేసుకుందాం.

2020, కాలికట్
ఆగస్టు 7న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం రన్‌వే దాటి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 18 మంది మృతి చెందగా, 172 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

2010, మంగళూరు
మే 22న జరిగిన ఈ ఘటనలో విమానం రన్‌వే దాటి కూలింది. 158 మంది మృతి చెందగా, కేవలం 8 మంది మాత్రమే బతికారు.

2000, పాట్నా
జూలై 17న అలయన్స్ ఎయిర్ విమానం రెసిడెన్షియల్ ఏరియాలో కూలిపోయింది. ఇందులో 60 మంది మరణించారు.

1996, చర్ఖీ దాద్రీ
నవంబర్ 12న రెండు విమానాలు గాలిలో ఢీకొన్నాయి. 349 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు.

1993, ఔరంగాబాద్
ఏప్రిల్ 26న టేకాఫ్ సమయంలో ట్రక్కును ఢీకొన్న ఈ ప్రమాదంలో 55 మంది మరణించారు.

1991, ఇంఫాల్
ఆగస్టు 16న జరిగిన ఈ ప్రమాదంలో 69 మంది ప్రాణాలు కోల్పోయారు.

1990, బెంగళూరు
ఫిబ్రవరి 14న జరిగిన ఘటనలో 92 మంది మరణించారు.

1988, అహ్మదాబాద్
అక్టోబర్ 19న ల్యాండింగ్ సమయంలో విమానం కూలిపోయింది. 133 మంది అక్కడికక్కడే చనిపోయారు.

1982, ముంబై
జూన్ 21న వాతావరణ మార్పుల కారణంగా విమానం కూలింది. 17 మంది మరణించారు.

1978, బాంద్రా
జనవరి 1న జరిగిన ఈ ఘోర ప్రమాదంలో 213 మంది మృతి చెందారు.ఈ ప్రమాదాలన్నింటిలోనూ వాతావరణం, రన్‌వే పొడవు, పైలట్ తప్పిదం వంటి అంశాలే ప్రధాన కారణాలుగా నిలిచాయి. ప్రతి సంఘటన విమాన భద్రతపై ప్రశ్నలు లేవనెత్తింది. ఈ దుర్ఘటనల్ని గుర్తు చేసుకుంటూ, భవిష్యత్తులో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నది స్పష్టం అవుతోంది.

Read Also : Ahmedabad Plane Crash: అహ్మదాబాద్‌ ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాదం..సినీ ప్రముఖుల సంతాపం

Ahmedabad plane crash India flight accidents Indian aviation safety Kalikutt air crash Mangalore air crash Top 10 flight accidents India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.