TN Elections 2026: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, నటుడు విజయ్ ఇప్పటికే పలుమార్లు భారతీయ జనతా పార్టీ (BJP)తో తమకు ఎలాంటి పొత్తు ఉండదని కుండబద్దలు కొట్టినప్పటికీ, రాజకీయ వర్గాల్లో ఊహాగానాలు మాత్రం ఆగడం లేదు. తాజాగా వెలువడుతున్న సమాచారం ప్రకారం, విజయ్ పార్టీని తమ గూటికి చేర్చుకునేందుకు బీజేపీ అధిష్ఠానం భారీ ఆఫర్లను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Read Also:Tamil Nadu: ఒంటరి పోరుకే విజయ్ మొగ్గు..ఎన్డీయే కూటమికి దళపతి నో!

ముఖ్యమంత్రి పదవిపైనే విజయ్ ప్రధాన దృష్టి
విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం.. టీవీకేకు అసెంబ్లీలో 80 స్థానాలతో పాటు ఉప ముఖ్యమంత్రి (Dy.CM) పదవిని కూడా ఇస్తామని బీజేపీ ప్రతిపాదించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని, అయితే ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా విజయ్ పావులు కదుపుతుండటంతో సీట్ల సర్దుబాటు మరియు పదవుల కేటాయింపుపై సందిగ్ధత కొనసాగుతోంది. విజయ్ తన తొలి ఎన్నికల్లోనే కింగ్ కావాలని ఆశిస్తుండటం బీజేపీకి పెద్ద సవాలుగా మారింది.
ఈ సంప్రదింపులలో ఒక పొరుగు రాష్ట్రానికి చెందిన ఉప ముఖ్యమంత్రి కీలక పాత్ర పోషిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. సదరు నేత విజయ్‌తో నిరంతరం చర్చలు జరుపుతూ, బీజేపీతో పొత్తు వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నట్లు సమాచారం. ఒకవైపు డిఎంకే కూటమిని ఎదుర్కోవాలంటే బలమైన ప్రత్యామ్నాయం ఉండాలని భావిస్తున్న విజయ్, ఈ ఆఫర్‌పై ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు తమిళ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: