📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు! ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం సీపీ సజ్జనార్‌తో సమావేశమైన సినీ ప్రముఖులు పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. యువకుడి పై కత్తితో దాడి.. 10 మందిని చంపేసిన నర్సు!

Latest news: TN Crime: మహిళల వాష్ రూముల్లో రహస్య కెమెరాలు.. పోలీసులే అవాక్కైన ఘటన

Author Icon By Saritha
Updated: November 6, 2025 • 12:58 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్త్రీకి స్త్రీయే శత్రువని ఈ ఉదంతం చదివితే నిజమేననిపిస్తుంది. ఓ మహిళగా తోటి మహిళల్ని గౌరవించాల్సింది పోయి, నీచమైన పనిద్వారా డబ్బును సంపాదించేందుకు దిగజారింది. ఆమె చేసిన పనిని తెలుసుకున్న పోలీసులే అవాక్కైపోయారు. కర్ణాటక-తమిళనాడు సరిహద్దులో ఉండి తమిళనాడు(Tamil Nadu) పరిధిలోకి వచ్చే డెంకణీకోట పట్టణ సమీపాన నాగమంగలంలో విస్తరించిన భారీ సెల్ ఫోన్ల తయారీ పరిశ్రమలో వేలాదిమంది మహిలలు పనిచేస్తున్నారు. ఆ కంపెనీలో పనిచేసే వారికి ఒక హాస్టల్ సైతం ఉంది. అందులో(TN Crime) దాదాపు రెండువేలమంది ఉంటున్నారు. వారుండే హాస్టల్ బిల్డింగ్ లోని స్నానాల గదుల్లో రహస్య కెమెరాలు అమర్చడం కలకలం రేపింది.

Read also: భక్తులకు గుడ్ న్యూస్.. 2 గంటల్లోనే శ్రీవారి దర్శనం!

TN Crime: మహిళల వాష్ రూముల్లో రహస్య కెమెరాలు.. పోలీసులే అవాక్కైన ఘటన

ఆందోళనకు దిగిన మహిళలు

మహిళలు స్నానాలు చేసే గదుల్లో కెమెరాలు పెట్టి ఆ వీడియోలను విక్రయించి వ్యాపారం చేస్తున్నారనే సమూచారం రావడంతో వారంతా ఆందోళనకు దిగారు. విధులు ముగించుకుని వచ్చినవారందరికి ఈ విషయం తెలియడంతో ఆందోళనకు దిగారు. బాధ్యులెవరో తేలల్చాలంటూ అర్థరాత్రి వరకు ఆందోళన చేశారు. విషయం తెలిసి కృష్ణగిరి జిల్లా ఎస్పీ తంగదురై, డెంకణీకోట డీఎస్పీ ఆనందరాజ్, సీఐ శంకర్ సంఘటన స్థలానికి చేరుకుని, మహిళలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా వారు ఆందోళన విరమించలేదు. దీంతో పోలీసులు అధికారిక నిఘా కెమెరాల వీడియోలను పరిశీలించారు. అందులో కెమెరాలు అమర్చింది ఎవరో తెలిసి షాక్ అయ్యారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన నీలకుమారి అనే మహిళే స్నానాల గదటుల్లో సీసీటీవీ కెమెరాలు అమర్చినట్లు పోలీసులు నిర్ధారించారు. వీటిలో నిక్షిప్తమైన వీడియోలను బబెంగళూరులో సంతోష్ అనే వ్యక్తికి పంపించి, వాటి ద్వారా వ్యాపారం చేస్తున్నట్లు తేలింది. పోలీసులు నీలకుమారిని అరెస్టు చేయడంతో మహిళా ఉద్యోగులు ఆందోళన విరమించారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మహిళలకు భద్రత అనేది కొరవడుతున్నది. ఇటీవల లేడీస్ వాష్ రూమ్లలో ఇలాంటి కెమెరాలను అమర్చడం ఎక్కువైపోతున్నది. స్త్రీ గౌరవాన్ని కీచకులు దిగజార్చే ప్రయత్నాలు చేయడం సిగ్గుచేటు.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Arrest Crime Harassment HiddenCamera Hostel IndiaNews Karnataka Latest News in Telugu Police Privacy tamilnadu TechnologyAbuse Telugu News WomenSafety

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.