📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు మేడారం జాతర లో ప్రసాదంగా ఇప్పపువ్వు లడ్డు నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన సాంబా సెక్టార్‌లోకి పాకిస్థాన్ డ్రోన్ త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటన.. నిరుద్యోగులకు భరోసా సీసీటీవీలో నిఖిత హత్య దృశ్యాలు పోలీసు శాఖకు కొత్త రూపు ఆర్టీసీ ఉద్యోగులకు హైకోర్టులో ఊరట సర్కారీ ఉద్యోగులకు1.02 కోట్ల ప్రమాద బీమా చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన! సంక్రాంతి ఎందుకు జరుపుకుంటారు? 12 రోజుల పండుగ పూర్తి కథనం ఫిబ్రవరి 8 నుంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్ ఈరోజు బంగారం ధరలు

Tirumala: శ్రీవారిని దర్శించుకున్న నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సీఈవో

Author Icon By Aanusha
Updated: January 11, 2026 • 5:47 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమల (Tirumala) శ్రీ వెంకటేశ్వర స్వామివారిని నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఆశిష్‌కుమార్ చౌహాన్ ఆదివారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఎన్ఎస్ఈ, దాని సభ్యులు, వాటాదారులు, దేశం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. ఈ ఉదయం శ్రీవారి దర్శనం ఎంతో సంతృప్తినిచ్చిందని చౌహాన్ పేర్కొన్నారు. “ఈరోజు ఉదయం తిరుమల (Tirumala) లో మాకు అద్భుతమైన దర్శనం లభించింది.

Read also: Tirupati: 25న గోవిందరాజస్వామి ఆలయంలో సాలకట్ల రథసప్తమి

Tirumala: The CEO of the National Stock Exchange had darshan of Lord Venkateswara

యాదృచ్చికం

ఎన్ఎస్ఈతో పాటు మా సభ్యులు, వాటాదారులు, దేశం కోసం ఆశీర్వాదం తీసుకున్నాం” అని ఆయన వివరించారు.ఈ పర్యటన చాలా ముందుగానే ఖరారైందని, అయితే తాను తిరుపతికి చేరుకున్న సమయంలోనే ఎన్ఎస్ఈ ఐపీఓకు సంబంధించిన ప్రకటన వెలువడటం యాదృచ్ఛికమని చౌహాన్ అన్నారు. దీనిని తాను ఒక శుభశకునంగా, దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నానని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.ఎన్ఎస్ఈ ఐపీఓకు ఈ నెలలోనే ఆమోదం లభించవచ్చని సెబీ ఛైర్మన్ తుహిన్ కాంత పాండే సూచించారని చౌహాన్ తెలిపారు.

భారత క్యాపిటల్ మార్కెట్ల చరిత్రలో ఎన్ఎస్ఈ ఐపీఓ అత్యంత ముఖ్యమైన లిస్టింగ్‌లలో ఒకటిగా నిలుస్తుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ కీలక తరుణంలో శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో ప్రశాంతతను ఇచ్చిందని, ఇది చిరస్మరణీయమని చౌహాన్ పేర్కొన్నారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Ashishkumar Chauhan latest news Lord Venkateswara NSE Telugu News tirumala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.