పశ్చిమ బెంగాల్, గవర్నర్ సి.వి. ఆనంద బోస్‌ను చంపేస్తామంటూ (Threats) వచ్చిన బెదిరింపు ఈమెయిల్ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. “నిన్ను బాంబు పెట్టి పేల్చివేస్తాం” అంటూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన హెచ్చరికతో భద్రతా యంత్రాంగం అప్రమత్తమైంది.గురువారం అర్ధరాత్రి లోక్ భవన్ (రాజ్‌భవన్) వద్ద భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు.
Tilak Varma injury : తిలక్ వర్మకు సర్జరీ, న్యూజిలాండ్‌తో తొలి 3 టీ20లకు దూరం BCCI
ఇప్పటికే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతలో ఉన్న గవర్నర్‌కు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కూడా రంగంలోకి దిగింది.ఉన్నతాధికారులు అప్రమత్తం అయ్యారు. అర్ధరాత్రి సమయంలోనే సీనియర్ భద్రతా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి, ప్రస్తుత భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. బెంగాల్ పోలీసులతో పాటు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ బలగాలు సమన్వయంతో రాజ్‌భవన్ చుట్టూ పహారాను పెంచాయి.
స్పందించిన బీజేపీ నేత అమిత్ మాలవీయ
గవర్నర్‌కు వచ్చిన బెదిరింపులపై బీజేపీ నేత అమిత్ మాలవీయ తీవ్రంగా స్పందించారు. మమతా బెనర్జీ పాలనలో గవర్నర్‌కే రక్షణ లేదని.. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కుప్పకూలాయని విమర్శించారు. ఒకవైపు బొగ్గు అక్రమ రవాణా, మనీలాండరింగ్ కేసుల్లో ప్రైవేట్ సంస్థలను కాపాడటానికి మమతా బెనర్జీ ప్రయత్నిస్తున్నారని.. అందుకే ఆమె ఈడీ ఫైళ్లను లాక్కోవడానికి చూస్తున్నారని మాలవీయ ఆరోపించారు.