ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్ 2025 (ICC Women’s Cricket World Cup 2025) ఫైనల్‌లో భారత జట్టు ఘన విజయాన్ని నమోదు చేసింది. ఈ చారిత్రక విజయంపై దేశవ్యాప్తంగా ఆనందం వెల్లివిరుస్తోంది. ఫైనల్ మ్యాచ్‌లో భారత క్రీడాకారిణులు చూపిన అసాధారణ ప్రతిభ, క్రమశిక్షణ, పట్టుదలతో కోట్లాది భారతీయుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ విజయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) స్పందిస్తూ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
Read Also: Nara Lokesh: షెఫాలీ వర్మ, దీప్తి శర్మ ప్రదర్శనపై మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు
ఈ చారిత్రక విజయంపై ప్రధాని స్పందిస్తూ (PM Modi), “టోర్నమెంట్ ఆద్యంతం మన జట్టు అసాధారణమైన టీమ్‌వర్క్, పట్టుదలను ప్రదర్శించింది. మన క్రీడాకారిణులకు నా అభినందనలు” అని పేర్కొన్నారు. భారత మహిళల జట్టు కనబరిచిన స్ఫూర్తిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.ఈ గెలుపు కేవలం ఒక ట్రోఫీ మాత్రమే కాదని,
దేశంలోని భవిష్యత్ ఛాంపియన్లకు గొప్ప ప్రేరణగా నిలుస్తుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. “ఈ చారిత్రక విజయం, క్రీడలను కెరీర్‌గా ఎంచుకోవడానికి యువతను మరింత ప్రోత్సహిస్తుంది” అని ఆయన అన్నారు. భారత జట్టు సాధించిన ఈ అద్భుతమైన విజయం దేశానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: