భారతీయ రైల్వే మానవతా విలువలకు నిలువెత్తు ఉదాహరణగా, క్యాన్సర్ బాధితుల (Cancer Patients)ప్రయాణానికి ప్రత్యేకంగా ఓ రైలు(Train)ను నడుపుతోంది. ఈ రైలు ప్రతి రోజు రాత్రి 9:20 గంటలకు పంజాబ్‌లోని బటిండా నుండి రాజస్థాన్‌లోని బికనీర్ వరకు ప్రయాణిస్తుంది. ఈ రైలు ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ప్రయాణించే వారిలో అధిక సంఖ్యలో క్యాన్సర్ రోగులే ఉంటారు. ఇది కేవలం రవాణా మార్గమే కాకుండా, బాధితులకు ఆశాదీపంగా మారింది.
రసాయన వ్యవసాయానికి చేదు ఫలితాలు
పంజాబ్‌లోని మల్వా ప్రాంతంలో వ్యవసాయ ఉత్పత్తి కోసం విస్తృతంగా రసాయనాలను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు ఏర్పడి, ఆ ప్రాంతంలో క్యాన్సర్ కేసులు భారీగా పెరిగాయి. రసాయనిక పురుగు మందులు, ఎరువుల ప్రభావంతో వందలాది మంది ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. చికిత్స కోసం బికనీర్‌లో ఉన్న ఆసుపత్రులు వారికీ నమ్మకమైన ఆశ్రయం కావడంతో, ఈ రైలు వారి ప్రధాన జీవనదారిగా మారింది.
రైలు మార్గంలో కనిపించే బాధలు, ఆశలు
ఈ రైలులో ఎక్కే ప్రతి ప్రయాణికుడి కథ వెనక ఒక పోరాటమే ఉంటుంది. వారు బికనీర్‌కు వెళ్లి చికిత్స తీసుకొని మళ్లీ తిరిగి వస్తుంటారు. చాలామంది ఆర్థికంగా వెనుకబడ్డ వారు కావడంతో, ఈ ట్రైన్ వారికీ జీవనరేఖగా మారింది. ఒక రైలు దేశంలో ఆరోగ్య సమస్యలు, పర్యావరణ అనారోగ్యాల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని గుర్తుచేస్తూనే, దేశంలో ఇంకా మానవతా విలువలు బ్రతకుతూన్నాయని కూడా చూపిస్తుంది.
Read Also : EdCET: తెలంగాణ ఎడ్‌సెట్ రిజల్ట్స్ విడుదల