కర్ణాటక రాష్ట్రంలో ఓ విచిత్రమైన దొంగ వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. వందలాది దొంగతనాలకు పాల్పడిన శివప్రసాద్ అలియాస్ మంత్రి శంకర్ అనే గజదొంగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గజదొంగగా పేరొందిన అతడిపై 300కు పైగా కేసులు నమోదయ్యాయి. అరెస్ట్ అనంతరం విచారణ చేపట్టిన పోలీసులు, ఆశ్చర్యానికి గురయ్యేంత వివరాలు వెలుగులోకి తెచ్చారు.
వింత గజదొంగ
శివప్రసాద్ ఎప్పుడూ తాళాలు వేసి ఉన్న పెద్ద ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవాడు. అయితే ఇతని తీరు సాధారణ దొంగలతో పోల్చితే భిన్నంగా ఉండేది. అతడు తాను దొంగతనంతో సంపాదించిన డబ్బులో భారీగా సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యాచరణలు నిర్వహిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలో నిందితుడి నుంచి సుమారు నిందితుడి వద్ద నుంచి రూ. 30 లక్షల విలువ చేసే 412 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటివరకు అతడు కోట్ల రూపాయల విలువైన ఆస్తి అపహరించాడని ఆధారాలు లభించాయి.
మంచి దొంగగా పేరు
అయితే, విచారణలో వెలుగులోకి వచ్చిన మరో కీలక విషయం పోలీసులను నివ్వెరపరిచింది. దొంగతనాలు చేసిన డబ్బుతోనే అతడు పేదల విద్యా ఖర్చులు భరించేవాడు. మహారాష్ట్రలోని ప్రముఖ దేవాలయ నిర్మాణానికి రూ. 5 లక్షల విరాళం ఇచ్చాడు. పలు దేవాలయాలకు బంగారు ఆభరణాలు, హారాలు సమర్పించాడు.పేదలకు ఆసుపత్రి చికిత్స ఖర్చులు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం వంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఇలా దానధర్మాలు చేయడం ద్వారా తాను చేసిన పాపాలకు ప్రక్షాళన జరుగుతుందని తాను బలంగా విశ్వసిస్తున్నట్లు చెప్పాడు. అయితే, ఈ ‘ధర్మదొంగ’ తన దొంగతనాల్లో అధునాతన పద్ధతులు కూడా వినియోగించేవాడు. చేతి వేలిముద్రలు పడకుండా ఉండేందుకు చేతి వేళ్లకు ఫెవికాల్ పూసుకునే విధానం అతని ప్రత్యేకత. దొంగతనాల సమయంలో ఎటువంటి ఆధారాలు మిగలకుండా తన పని పూర్తి చేసుకునే విధంగా అద్భుతమైన శిక్షణ పొందినట్లు పోలీసులు తెలిపారు.
Read also: Caste Census: కుల గణనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ పై రాహుల్ గాంధీ సూచనలు