📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు పోలీస్ నియామకాలు పూర్తి దాదాపు 2 వేలకు పెరగనున్న మెడికల్ సీట్లు స్మార్ట్ రేషన్ కార్డులు.. ఇవాళే చివరి తేదీ జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు

Latest News: Whisky: దేశంలో విస్కీ తాగే రాష్ట్రాలు ఇవే! టాప్-10 లో తెలుగు రాష్ట్రాలు

Author Icon By Aanusha
Updated: October 31, 2025 • 9:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మన దేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో మద్యం వినియోగం అధికంగా ఉంటుందనే విషయం కొత్తేమీ కాదు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ఆల్కహాల్ సేవించే సంస్కృతి చాలా కాలంగా కొనసాగుతోంది.

సామాజిక వేడుకలు, పండుగలు, వ్యక్తిగత కార్యక్రమాలన్నింటికీ మద్యం వినియోగం (Alcohol consumption) ఒక భాగంగా మారిపోయింది. ఆర్థిక పరంగా చూసినా, మద్యం విక్రయాల ద్వారా రాష్ట్రాలకు వచ్చే ఆదాయం ఎంతో కీలకం. తెలుగు రాష్ట్రాల్లో అయితే ఈ ఆదాయమే ప్రభుత్వ ఖజానాకు బలమైన ఆధారం అవుతోంది.

Read Also: Haryana Crime: ఉద్యోగినులకు పీరియడ్స్‌..రుజువు చూపించాలన్న పై అధికారులు

ఇక తెలుగు రాష్ట్రాల్లో గత కొన్నేళ్లుగా రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. ఒకే రోజు వందల కోట్ల అమ్మకాలు కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి.2025 ఆర్థిక సంవత్సరంలో ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ విభాగం (Indian Made Foreign Liquor Section) లో మొత్తం 40.17 కోట్ల కేసుల మద్యం విక్రయాలు నమోదైనట్లు లెక్కలు చెబుతున్నాయి.

విస్కీ వినియోగంలో జాతీయ స్థాయిలో చిన్నపాటి హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ.. దేశంలో అమ్ముడవుతున్న విస్కీలో ఏకంగా 58 శాతం వాటాతో దక్షిణాది రాష్ట్రాలే అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి.దేశవ్యాప్తంగా 2025 ఆర్థిక ఏడాదిలో విస్కీ విక్రయాల్లో టాప్ 10 రాష్ట్రాల జాబితాలో దక్షిణాది రాష్ట్రాలు పూర్తిగా ఆధిపత్యం కనబరుస్తున్నాయి.

Whisky

బెంగళూరు వంటి మెట్రో నగరం

దేశం మొత్తంలో 17 శాతం వాటాతో కర్ణాటక తొలి స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో 6.83 కోట్ల కేసుల విస్కీ బాటిళ్లు అమ్ముడుపోయాయి. బెంగళూరు వంటి మెట్రో నగరం కారణంగా కర్ణాటక మొదటి స్థానంలో ఉండటానికి కారణం అయిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాతి స్థానంలో 13 శాతం మార్కెట్ వాటాతో తమిళనాడు రెండో ప్లేసులో ఉంది.

5.22 కోట్ల కేసులు విక్రయించారు.9 శాతం మార్కెట్ వాటాతో తెలంగాణ (Telangana) మూడో స్థానంలో ఉంది. తెలంగాణలో ఈ ఏడాది 3.61 కోట్ల కేసుల మద్యం అమ్ముడైంది. తెలంగాణలో తలసరి విస్కీ వినియోగం దేశంలోనే అత్యధికంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి.

ఢిల్లీ వంటి పెద్ద రాష్ట్రాలు కూడా

ఇందుకు హైదరాబాద్‌ (Hyderabad) లోని విస్తరిస్తున్న మధ్యతరగతి వినియోగదారులే కారణమని పేర్కొంటున్నాయి. నాలుగో స్థానంలో ఆంధ్రప్రదేశ్ 8 శాతం మార్కెట్ వాటాను కలిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 3.21 కోట్ల మద్యం సీసాలు విక్రయం అయ్యాయి. 5వ స్థానంలో మహారాష్ట్ర 7 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉండి..

2.81 కోట్ల మద్యం కేసుల అమ్మకాలు జరిగాయి.ఇక 6 శాతం మార్కెట్ వాటాతో ఉత్తర్‌ప్రదేశ్.. 3 శాతం మార్కెట్ వాటాతో ఢిల్లీ వంటి పెద్ద రాష్ట్రాలు కూడా విస్కీ (Whisky) వినియోగంలో దక్షిణాది రాష్ట్రాల కంటే చాలా వెనుకబడి ఉండటం గమనార్హం. విస్కీ మార్కెట్ కేవలం వినియోగంలోనే కాకుండా.. ఆర్థిక వ్యవస్థకు కూడా బలంగా మద్దతు ఇస్తోంది.

దాదాపు 67 శాతం వాటాను విస్కీ

భారత విస్కీ మార్కెట్ 2024 నాటికి 19.16 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2025 నాటికి మొత్తం స్పిరిట్స్ మార్కెట్‌లో దాదాపు 67 శాతం వాటాను విస్కీ (Whisky) రంగం అందించనుంది. ఈ రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 5.3 లక్షల మందికి జీవనోపాధి కల్పిస్తోంది.ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో మాత్రమే 2023-24 ఆర్థిక సంవత్సరంలో మద్యం రంగం ద్వారా సుమారు రూ.45,570 కోట్ల ఎక్సైజ్ ఆదాయం సమకూరింది.

బ్రిటన్-భారత్ వాణిజ్య ఒప్పందం వల్ల స్కాచ్, విస్కీ సుంకాలు తగ్గితే.. రాబోయే 5 ఏళ్లలో ఎగుమతులు 1 బిలియన్ పౌండ్ల మేర పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. విస్కీ వినియోగం భారత్‌లో ఒక బలమైన సాంస్కృతిక, ఆర్థిక అంశంగా మారిపోయింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

Alcohol Consumption Andhra Pradesh excise revenue latest news Telangana Liquor Sales Telugu News telugu states

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.