📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Vijay: విజయ్ ర్యాలీలో.. తొక్కిసలాటకు కారణాలు ఇవే!

Author Icon By Anusha
Updated: September 28, 2025 • 9:00 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తమిళనాడులో వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికల వేళ రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న నేతల్లో నటుడు దళపతి విజయ్ ప్రత్యేకంగా నిలుస్తున్నారు. కొన్ని నెలల క్రితం ఆయన స్థాపించిన “తమిళగ వెట్రి కళగం” (టీవీకే) పార్టీ ((TVK) Party) ఇప్పటికే ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది.

స్థాపన తర్వాత నుంచే విజయ్ వరుసగా సభలు, ర్యాలీలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలపై గళం విప్పుతున్నారు. కేంద్రంలోని నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వంపై, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ (M.K. Stalin) నాయకత్వంలోని ద్రావిడ మున్నేట్ర కళగంపై ఆయన తరచూ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. దీంతో విజయ్ పార్టీ రాజకీయ ప్రస్థానంపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి పెరిగింది.

Oil India Limited : అండమాన్ సముద్రంలో గ్యాస్ గుర్తింపు

Vijay

తమిళనాడు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది

ఈ నేపథ్యంలోనే తాజాగా కరూర్‌ జిల్లాలో విజయ్ (Vijay) నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. శనివారం జరిగిన ఈ భారీ ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగింది. ఇప్పటివరకు వచ్చిన వార్తల ప్రకారం.. 36 మందికి పైగా జనం ఈ తొక్కిసలాటలో ప్రాణాలు విడిచినట్లు తెలుస్తోంది. ఇక మృతుల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నట్లు తెలియడం తీవ్ర కలవరపాటుకు గురి చేస్తోంది.

ఈ ఘటనపై విచారణ జరిపేందుకు విశ్రాంత న్యాయమూర్తి అరుణ జగదీషన్ (Aruna Jagadeeshan) ఆధ్వర్యంలో తమిళనాడు ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.అయితే ఈ తొక్కిసలాటకు కారణాలు చాలా ఉన్నాయని పరిస్థితిని బట్టి చూస్తే అర్థం అవుతోంది. అనుకున్నదాని కంటే ఎక్కువగా జనం రావడం.. ర్యాలీకి విజయ్ ఆలస్యంగా రావడం, ఓ బాలిక కనిపించకుండా పోవడం వంటి అనేక కారణాలు కనిపిస్తున్నాయి.

ఈ ర్యాలీకి 10 వేల మంది వస్తారని అంచనా వేసిన

అయితే కరూర్ ర్యాలీ (Karur Rally) కి 30 వేల మంది జనం వచ్చినట్లు పోలీసులు ప్రాథమికంగా వెల్లడించారు. కానీ ఈ ర్యాలీకి 10 వేల మంది వస్తారని అంచనా వేసిన టీవీకే వర్గాలు.. ప్రభుత్వం వద్ద అదే విషయాన్ని చెప్పి అనుమతి తీసుకుంది. కానీ చివరికి అంతకు 3 రెట్ల మంది రావడంతో వారిని అదుపు చేయడం పోలీసులకు తలకు మించిన భారంగా మారింది.మరోవైపు.. ఈ తొక్కిసలాటకు మరో ప్రధాన కారణం విజయ్ ఆలస్యంగా రావడమేనని స్థానికులు చెబుతున్నారు.

షెడ్యూల్ ప్రకారం.. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆ ప్రాంతానికి చేరుకోవాల్సి ఉండగా.. విజయ్ మాత్రం సుమారు ఆరు గంటలు ఆలస్యంగా అంటే సాయంత్రం 6 గంటల సమయంలో ఆ ర్యాలీకి చేరుకున్నారు. దీంతో మధ్యాహ్నం నుంచే అక్కడికి చేరుకున్న జనం.. దాదాపు 6 గంటలకు పైగా వేచి ఉన్నారు.

విజయ్ ప్రసంగించడానికి ముందు అభిమానులు, మద్దతుదారులు

దీనికితోడు ఆ ప్రాంతంలో భారీగా జనం గుమిగూడటంతో.. ఉక్కపోత, రద్దీ కారణంగా అప్పటికే వారు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు.మరోవైపు.. విజయ్ ప్రసంగించడానికి ముందు అభిమానులు, మద్దతుదారులు ఆయన నిలబడిన బస్సు వైపు ఒక్కసారిగా దూసుకురావడంతో కొందరు కిందపడిపోయారు. ఇదే తొక్కిసలాటకు దారితీసిందని పలువురు చెబుతున్నారు.

మరోవైపు.. ఆ ర్యాలీలో ఓ బాలిక కనిపించకుండా పోవడంతో ఆమె కుటుంబ సభ్యులు వెతడకడం ప్రారంభించారు. ఇది కూడా అక్కడ గందరగోళానికి దారి తీసినట్లు తెలుస్తోంది. ఇక తొక్కిసలాట (Stampede) పరిస్థితిని బస్సు పైనుంచి గమనించిన విజయ్.. వెంటనే తన ప్రసంగాన్ని ఆపేసి.. జనంపైకి నీళ్ల సీసాలు విసిరేశారు.

ఈ దుర్ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్

ఇక గాయపడిన వారిని తరలించేందుకు అక్కడికి వచ్చే అంబులెన్స్‌లకు దారి ఇవ్వాలని వారిని కోరారు.ఈ దుర్ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (Tamil Nadu Chief Minister M.K. Stalin) ఎక్స్ వేదికగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కరూర్ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటకు సంబంధించి వస్తున్న వార్తలు చాలా బాధాకరంగా ఉన్నాయని పేర్కొన్నారు.

స్పృహ కోల్పోయిన వారికి అత్యవసరంగా చికిత్స అందించాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి, కరూర్ జిల్లా కలెక్టర్, మాజీ మంత్రి సెంథిల్ బాలాజీలకు సహాయక చర్యలు పర్యవేక్షించాలని సూచించినట్లు స్టాలిన్ తెలిపారు.

పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు

యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు అందించాలని మంత్రి అన్బిల్ మహేష్‌ను ఆదేశించినట్లు చెప్పారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు స్టాలిన్ తన పోస్ట్‌లో వెల్లడించారు.ఇక.. దళపతి విజయ్ ర్యాలీల్లో ఇలాంటి ప్రమాదాలు జరగడం ఇదే మొదటిసారి కాకపోవడం గమనార్హం.

ఈ నెలలోనే తిరుచ్చి (Tiruchhi) లో జరిగిన ఆయన తొలి ర్యాలీ కూడా భారీ ట్రాఫిక్ జామ్‌కు దారితీసింది. అది అప్పట్లో తీవ్ర భద్రతాపరమైన ప్రశ్నలను లేవనెత్తింది. దీనిపై మద్రాస్ హైకోర్టు కూడా స్పందించింది. ర్యాలీలు, సభల సమయంలో భద్రతా నియమాలు పాటించడంపై టీవీకే పార్టీ ఎలాంటి బాధ్యత వహిస్తోందని ప్రశ్నించింది.

ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా స్పందించారు

పోలీసులు 23 నిబంధనలు విధించినా.. అభిమానులు వాటిని ఉల్లంఘించడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందా అనే కోణంలోనూ దర్యాప్తు జరుగుతోంది.ఇక విజయ్ ర్యాలీలో తొక్కిసలాటకు సంబంధించిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) కూడా స్పందించారు. కరూర్‌ ఎన్నికల ప్రచార సభలో జరిగిన దురదృష్టకర సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా బాధిత కుటుంబీకులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కష్ట సమయంలో వారికి మనోధైర్యం అందించాలని.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

36 people dead Breaking News children among victims dalapathi vijay political rally karur stampede incident latest news tamil nadu assembly elections Telugu News Vijay TVK Party

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.