కర్ణాటక రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలో అధికార మార్పిడి ఊహాగానాలు జోరందుకున్న తరుణంలో.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నివాసంలో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్‌లో పాల్గొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి శివకుమార్‌కు సీఎం బాధ్యతలు అప్పగిస్తారన్న వార్తల నేపథ్యంలో.. ఈ ఇద్దరు నేతల భేటీకి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది.
Read Also: Gold Rate in India : ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. వెండి కూడా మెరుపులు..

ఇద్దరం కలిసే ఉంటాం.. కలిసే పనిచేస్తాం
CM సిద్దరామయ్య తో బ్రేక్ ఫాస్ట్ తర్వాత Dy.CM డీకే శివకుమార్ మీడియాతో మాట్లాడారు. కర్ణాటక కాంగ్రెస్ లో, ఎలాంటి వర్గాలు లేవని Dy.CM డీకే శివకుమార్ (DK Shivakumar) స్పష్టం చేశారు. ‘ఇక్కడున్నది ఒకే ఒక్క కాంగ్రెస్ గ్రూప్ మాత్రమే. మా ఇద్దరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఇద్దరం కలిసే ఉంటాం.. కలిసే పనిచేస్తాం. అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. మా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సాధ్యం కాదు’ అని వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: