📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Telugu News: Madhya Pradesh-గర్భిణీగా ఉన్నప్పటికీ లక్ష్యం సాధించిన వర్షా పటేల్ కథ

Author Icon By Pooja
Updated: September 14, 2025 • 11:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Madhya Pradesh: లక్ష్యాన్ని చేరుకోవాలనే తపన ఉంటే ఎలాంటి అడ్డంకులు ఎదురైనా వెనకడుగు వేయకూడదని మధ్యప్రదేశ్‌కు చెందిన వర్షా పటేల్ నిరూపించారు. సాధారణంగా మహిళలు గర్భం దాల్చిన సమయంలో శారీరకంగా బలహీనంగా ఫీలై విశ్రాంతి తీసుకుంటారు. అయితే వర్షా మాత్రం పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPPSC) పరీక్షలకు సిద్ధమవుతూ తన కృషిని కొనసాగించారు. గర్భిణీ స్థితిలోనే చదువుతో పాటు అన్ని జాగ్రత్తలు పాటించారు. ఫలితాల్లో టాపర్‌గా నిలిచిన ఆమె, ఇంటర్వ్యూకు(interview) పిలుపు వచ్చిన సమయంలో కేవలం 26 రోజుల పసికందు తల్లిగా ఉన్నా, భర్తకు బిడ్డను అప్పగించి ఇంటర్వ్యూకు హాజరై విజయం సాధించారు. ప్రస్తుతం ఆమె డీఎస్పీగా నియమితులయ్యారు.

ఐదు సార్లు చేసిన ప్రయత్నం

మైహర్ జిల్లాకు చెందిన వర్షా పటేల్ తన విజయం వెనుక ఐదు సార్లు చేసిన కృషి ఉందని చెబుతున్నారు. భర్త సంజయ్ పటేల్ తన ఉద్యోగాన్ని వదిలి పూర్తిగా అండగా నిలిచారని ఆమె తెలిపారు. ఐదు సార్లు MPPSC పరీక్షలు రాసిన వర్షా, అందులో మూడుసార్లు ఇంటర్వ్యూవరకు వెళ్లినా విఫలమయ్యారు.(Failed) కానీ నిరాశ చెందకుండా ఐదోసారి విజయాన్ని సొంతం చేసుకున్నారు.

యువతకు సందేశం

“కష్టపడి పని చేస్తే ఓటమి అనేది ఉండదు. విజయం సాధించే వరకు ప్రయత్నాలు ఆగకూడదు” అని వర్షా పటేల్ యువతకు స్పష్టమైన సందేశం ఇచ్చారు. పట్టుదల, సహనం, నిరంతర కృషి ఉంటే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని ఆమె జీవితం సాక్ష్యం.

వర్షా పటేల్ ఏ రాష్ట్రానికి చెందిన వారు?
వర్షా పటేల్ మధ్యప్రదేశ్‌కు చెందిన వారు.

ఆమె ఎన్ని సార్లు MPPSC పరీక్ష రాశారు?
మొత్తం ఐదు సార్లు పరీక్ష రాశారు.

Read hindi News: Hindi.vaartha.com

Read also:

https://vaartha.com/anjan-kumar-yadav-jubilee-hills-by-election-congress-ticket-contest/news/politics/546926/

Google News in Telugu Inspirational Women India Latest News in Telugu Madhya Pradesh DSP MPPSC Topper Pregnant Woman Cracks Exam Telugu News Today Varsha Patel Success Story

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.