గుజరాత్ (Gujarat)లో ఆసియా సింహాల (Asiatic lions) సంతతి భారీగా పెరిగింది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి (Gujarat CM) భూపేంద్ర పటేల్ (Bhupendra Patel) బుధవారం ప్రకటించారు. ఈ మేరకు సింహాల జనాభాపై నిర్వహించిన 2025 గణాంకాలను విడుదల చేశారు. ఐదేళ్ల క్రితం 674గా ఉన్న సింహాల సంఖ్య ఈ ఏడాది ఇప్పటి వరకూ 891కి పెరిగినట్లు చెప్పారు.
11 జిల్లాల్లో ఈ సింహాలు జీవిస్తున్నాయి
గుజరాత్ రాష్ట్రంలో ఆసియా సింహాల సంతతి గణనాత్మకంగా పెరిగింది. గత 2025 మే 13న ముగిసిన 16వ సింహాల గణనలో, గుజరాత్‌లో ఆసియా సింహాల సంఖ్య 900కి చేరే అవకాశం ఉందని అంచనా వేయబడింది. ఇది 2020లో నమోదైన 674 సింహాలతో పోలిస్తే 30% పెరుగుదలని సూచిస్తుంది. ఇది గత దశాబ్దంలో 72% వృద్ధిని మరియు 2010లో ఉన్న 411 సింహాలతో పోలిస్తే 119% పెరుగుదలని ప్రతిబింబిస్తుంది .
జూన్ 2020లో ఆ సంఖ్య 674గా ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో ఈ సింహాలు జీవిస్తున్నట్లు చెప్పారు. జునాగఢ్, గిర్ సోమనాథ్, భావ్‌నగర్, రాజ్‌కోట్, మోర్బి, సురేంద్రనగర్, దేవభూమి ద్వారక, జామ్‌నగర్, అమ్రేలి, పోర్ బందర్, బోటాడ్‌లో ఈ సింహాలు విస్తరించినట్లు సీఎం చెప్పారు.
మే 10- 11 తేదీల్లో సింహాల ప్రాథమిక జనాభా గణన నిర్వహించగా, తుది జనాభా గణనను మే 12-13 తేదీల్లో ప్రాంతీయ, జోనల్, సబ్-జోనల్ అధికారులు, ఎన్యూమరేటర్లు, అసిస్టెంట్ ఎన్యూమరేటర్లు, ఇన్‌స్పెక్టర్లు సహా 3,000 మంది స్వచ్ఛంద సేవకుల సహాయంతో నిర్వహించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. అటవీ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలతో గిర్ అడవుల్లోని సింహాల సంఖ్య పెరుగుతోందని ఆయన తెలిపారు. అటవీ యంత్రాంగం తీసుకుంటున్న చర్యలతో గిర్ అడవుల్లోని సింహాల సంఖ్య పెరుగుతోందని ఆయన తెలిపారు.
ప్రధాన నివాస ప్రాంతం
సింహాల సంతతి పెరుగుదలతో, గుజరాత్ రాష్ట్రం ప్రపంచంలో ఆసియా సింహాల ప్రధాన నివాస ప్రాంతంగా నిలుస్తోంది. భవిష్యత్తులో, సింహాల సంరక్షణను మరింత బలోపేతం చేయడానికి, స్థానిక సమాజాల సహకారం, భూభాగ నిర్వహణ, మరియు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి చర్యలు తీసుకోవడం అవసరం.
Read Also : MBBS Seats: ఎంబీబీఎస్ స్థానిక కోటాపై జూన్ 2న విచారణ