📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

ఈ రోజు సాయంత్రం ఢిల్లీ సీఎం పేరు ప్రకటన..

Author Icon By sumalatha chinthakayala
Updated: February 19, 2025 • 3:27 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

న్యూఢిల్లీ: ఈ రోజు సాయంత్రం ఢిల్లీ సీఎం పేరు ప్రకటన.ఢిల్లీ నూతన ముఖ్యమంత్రి ఎవరనే విషయానికి బుధవారం తెరపడనుంది. బుధవారం మధ్యాహ్నం బీజేఎల్పీ సమావేశం కానుంది. దీంతో ఢిల్లీ నూతన సీఎంపై స్పష్టత వస్తుంది. బీజేపీ శాసనసభాపక్ష సమావేశంలో బీజేఎల్పీ నేతను ఎమ్మెల్యేలు ఎన్నుకోనున్నారు. ఈ సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో పాటు ఢిల్లీ బీజేపీ ఎంపీలు కూడా పాల్గొంటారు. బీజేఎల్పీ నేత ఎన్నిక తర్వాత లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ను నేతలు కలవనున్నారు. ఇప్పటికే సిఎం ప్రమాణస్వీకారం కోర్డినేటర్లుగా వినోద్ తావ్డే, తరుణ్ చుగ్‌లను బీజేపీ అధిష్ఠానం నియమించింది.శాసనసభాపక్ష నేతను ఎన్నుకోవడానికి సమావేశం కానున్న బీజేపీ ఎమ్మెల్యేలు.

గురువారం ముఖ్యమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం

కాగా, ముఖ్యమంత్రి, మంత్రివర్గ ప్రమాణ స్వీకారం గురువారం జరగనుంది. ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో పర్వేష్ వర్మ (న్యూ ఢిల్లీ), రేఖా గుప్తా (షాలిమార్ బాగ్), విజేందర్ గుప్తా (రోహిణి), సతీష్ ఉపాధ్యాయ్ (మాల్వియా నగర్), ఆశిష్ సూద్ (జనక్‌పురి), పవన్ శర్మ (ఉత్తమ్ నగర్), అజయ్ మహావార్ (ఘోండా) తదితరులు ఉన్నారు. రాం లీలా మైదానంలో ప్రమాణస్వీకారానికి ఢిల్లీ ప్రభుత్వం అధికారులు ఏర్పాట్లు చేశారు. కాగా ఢిల్లీ సిఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్డీఏ కీలక నేతలు హాజరవుతున్నారు.ఈ రోజు సాయంత్రం ఢిల్లీ సీఎం పేరు ప్రకటన.

ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరుకానున్న 20 రాష్ట్రాల సీఎంలు

ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి 20 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానాలు పంపారు. 50 మంది సినీ తారలు, పారిశ్రామికవేత్తలు, దౌత్యవేత్తలకు కూడా ఆహ్వానాలు వెళ్లాయి. వీరితో పాటు బాబా రాందేవ్, స్వామి చిదానంద, బాబా బాగేశ్వర్ ధీరేంద్ర శాస్త్రితో పాటు పలువురు మత ప్రముఖులు హాజరుకానున్నారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. ఇక్కడ సుమారు 30 వేల మంది కూర్చునేందుకు వీలుగా ఉన్న రామ్ లీలా మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కావల్సిన ఏర్పాట్లు అధికారులు చేస్తున్నారు.

BJP Breaking News in Telugu Delhi CM Google news Google News in Telugu Telugu News online

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.