ఈ రోజుల్లో మొబైల్ (Mobile) మనల్ని వదలడం లేదు. పెద్దవారైనా, పిల్లలైనా గంటల కొద్దీ మొబైల్ చూస్తున్నారు. స్క్రీన్ ముందు కూర్చుంటూ సమయమే మర్చిపోతున్నారు.ఇప్పుడూ మనుషులకే కాదు… జంతువులకూ మొబైల్ మత్తు వచ్చింది. తాజాగా ఓ పాము మొబైల్‌లో (A snake on a mobile) వీడియో చూసి ఆశ్చర్యపరిచింది. అది ఇప్పుడంతా వైరల్ అవుతోంది.ఒక గోనె సంచిపై మొబైల్ పెట్టారు. అందులో పవన్ సింగ్ భోజ్‌పురి పాట ప్లే అవుతోంది. పాటే కాదు, వీడియోకూ పాము హిప్నటైజ్ అయింది. పడగ ఎత్తి ఆ స్క్రీన్‌నే చూస్తోంది.ఆ పాము వెనుక ఒక వ్యక్తి నిలబడి ఉన్నాడు. ఆ సన్నివేశాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఆ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ లో అప్‌లోడ్ చేశాడు.
సోషల్ మీడియాలో షేర్ చేసి వైరల్ చేశారు
@raj.yaduvansi.961 అనే అకౌంట్ ఈ వీడియోను షేర్ చేసింది. కొన్ని గంటల్లోనే వీడియో అద్భుతంగా ట్రెండ్ అయింది.ఇప్పటివరకు ఆ వీడియోను 60 లక్షల మందికిపైగా చూశారు. 2.2 లక్షలకిపైగా లైకులు వచ్చాయి. కామెంట్ల వర్షం కురిసింది.
నెటిజన్ల కామెంట్ల హడావిడి
పవన్ సింగ్‌కు కొత్త అభిమాని పాము అంటూ ఒకరు రాశారు. స్క్రీన్ మాయ నుంచి పామూ తప్పించుకోలేకపోయిందంటూ మరొకరు జోక్ చేశారు.ఈ వీడియో చూస్తే అసలు మనిషి, పాము మధ్య తేడా ఏముందా అనిపిస్తోంది. మొబైల్ ఆకర్షణకు జంతువులు కూడా గురవుతున్నాయంటే అంతే చెప్పాలి.
Read Also : Honeymoon Murder : సోనమ్‌ను ఉరి తీయాలి : సోనమ్ సోదరుడు