📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Central Govt: ఓలా, ఉబర్‌లకు పోటీగా ‘భారత్ ట్యాక్సీ’ పేరుతో అందుబాటులోకి తీసుకురానున్నకేంద్ర ప్రభుత్వం

Author Icon By Aanusha
Updated: October 25, 2025 • 7:11 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలో రైడ్-హెయిలింగ్ సర్వీసుల్లో ఎంతో కాలంగా ఓలా, ఉబర్ సంస్థలు (Ola and Uber companies) ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ముఖ్యంగా డ్రైవర్లు కస్టమర్స్ నుంచి అధిక కమీషన్‌, సర్జ్ ఛార్జీలు వసూలు చేయడం వంటి అంశాలపై నిరంతరం విమర్శలు వస్తున్నాయి. అంతేకాకుండా, రద్దీ సమయాలు, ట్రిప్ రద్దుల పేరుతో ప్రయాణికులపై కూడా అధిక చార్జీల భారం మోపుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారంగా, డ్రైవర్లు, ప్రయాణికులు ఇద్దరికీ ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో కేంద్రం (Central Govt) ఈ కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది.

HTT-40: భారత్ తొలి ట్రైనర్ విమానం – నెక్స్ట్ జెనరేషన్ వైమానిక శిక్షణ ప్రారంభం

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Govt) కొత్త ప్రత్యామ్నాయాన్ని తీసుకురావాలని నిర్ణయించింది. త్వరలోనే ‘భారత్ ట్యాక్సీ’ పేరుతో సహకార పద్ధతిలో ఒక నూతన క్యాబ్ సర్వీస్‌ను దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టేందుకు చర్యలు ప్రారంభించింది.డ్రైవర్ల నుంచి ఎలాంటి కమీషన్లు వసూలు చేయకుండా, కేవలం సభ్యత్వ రుసుముతోనే ఈ సేవలు అందించనుండటం దీని ప్రత్యేకత.

Central Govt

దీనివల్ల ప్రయాణ చార్జీలు పూర్తిగా వారికే

కేంద్ర సహకార శాఖ, జాతీయ ఈ-గవర్నెన్స్ విభాగం (NeGD) కలిసి ‘భారత్ ట్యాక్సీ’ని రూపొందించాయి. దీని కోసం రూ.300 కోట్ల మూలధనంతో ‘సహకార్ ట్యాక్సీ కో-ఆపరేటివ్ లిమిటెడ్’ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఈ విధానంలో డ్రైవర్లు కమీషన్లకు బదులుగా రోజువారీ లేదా నెలవారీ సభ్యత్వ రుసుము చెల్లిస్తే సరిపోతుంది. దీనివల్ల ప్రయాణ చార్జీలు పూర్తిగా వారికే దక్కుతాయి.

ఈ సేవలను తొలుత పైలట్ ప్రాజెక్ట్‌గా నవంబర్ నుంచి ఢిల్లీలో 650 క్యాబ్‌లతో ప్రారంభించనున్నారు. ఆ తర్వాత డిసెంబర్‌లో ముంబై, పుణె, భోపాల్, జైపూర్ వంటి 20 నగరాలకు విస్తరిస్తారు. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో ‘భారత్ ట్యాక్సీ’ని అందుబాటులోకి తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. 2030 నాటికి దేశవ్యాప్తంగా లక్ష మంది క్యాబ్ డ్రైవర్లను ఈ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

bharat taxi Breaking News government ride hailing latest news ola uber alternative Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.