📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Census : జనగణనకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన కేంద్రం

Author Icon By Sudha
Updated: June 16, 2025 • 3:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎంతోకాలంగా వాయిదాపడుతూ వస్తున్న జనగణన (Census) ప్రక్రియ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నది. దేశంలో 16 ఏండ్ల తర్వాత చేపడుతున్న ఈ జనగణనకు సంబంధించిన గెజిట్‌ నోటిఫికేషన్‌ (Gazette Notification) సోమవారం విడుదలైంది.

Census : జనగణనకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన కేంద్రం

2021లో జరుగాల్సిన జనగణన వాయిదా పడింది, ఇప్పుడు వచ్చే ఏడాది ప్రారంభంలో మళ్లీ నిర్వహించబడుతుంది. ఈ ప్రక్రియ దేశం వ్యాప్తంగా ప్రజల సంఖ్య, నివాస ప్రాంతాలు, సామాజిక, ఆర్థిక, విద్య, వృత్తి తదితర సమాచారాన్ని సేకరించడానికి జరుగుతుంది.
8వ జన గణన
కేంద్ర హోం శాఖ ఈ గెజిట్‌ను విడుదల చేసింది. రెండు దశల్లో జరుగనున్న ఈ ప్రక్రియ మొత్తంగా 16వదికాగా, స్వాతంత్య్రానంతరం చేపట్టబోయే 8వ జన గణన. 2027 మార్చి 1వ తేదీ నాటికి ఇది పూర్తి కానుంది. తొలి దశలో భాగంగా హిమాలయ ప్రాంతాలైన జమ్ముకశ్మీర్‌, లద్దాఖ్‌, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో 2026, అక్టోబర్‌ 1 నుంచి, రెండో దశలో భాగంగా 2027, మార్చి 1 నుంచి దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో జన గణనను చేపట్టనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ప్రకటించింది.
కుల గణన
ఈ సారి జనగణనతోపాటు కుల గణననూ చేపడుతున్నారు. ఇందుకోసం మొత్తం 34లక్షల మంది గణకులు, సూపర్‌వైజర్లు, 1.34లక్షల మంది సిబ్బంది పని చేస్తారు. ఈసారి జనాభా లెక్కల సేకరణ అంతా ట్యాబ్‌ల ద్వారా పూర్తిగా డిజిటల్‌ రూపంలోనే సాగుతుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. ప్రభుత్వం వెల్లడించే పోర్టళ్లు, యాప్‌లలో ప్రజలు సొంతంగానే తమ వివరాలను నమోదుచేసే వెసులుబాటునూ కల్పిస్తున్నారు. డేటా భద్రత కోసం కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. సమాచారణ సేకరణ, బదిలీ, స్టోరేజీని అత్యంత కట్టుదిట్టంగా చేపడుతున్నట్లు పేర్కొంది. సెక్షన్‌ 3, జనగణన చట్టం, 1948 ప్రకారం జన-కులగణనను చేపట్టనున్నట్టు వివరించింది.
16 ఏండ్ల తర్వాత
దేశంలో జనగణనను పదేండ్లకోసారి నిర్వహిస్తారు. చివరిసారిగా 2011లో ఈ ప్రక్రియను చేపట్టారు. రెండు విడుతల్లో ఈ ప్రక్రియ జరిగింది. వాస్తవానికి 2021లోనే జన గణనను నిర్వహించాలి. అయితే, కొవిడ్‌ కారణంగా ఈ ప్రక్రియ వాయిదా పడింది. అయితే, ఇప్పుడు 16 ఏండ్ల తర్వాత తొలిసారిగా జనాభా గణనను నిర్వహించనున్నారు. దీంతోపాటు తొలిసారిగా కులగణనను కూడా చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతో పాటే కులగణనను కూడా చేపట్టనున్నట్టు గత నెలలో కేంద్రం వెల్లడించడం తెలిసిందే. కాగా జనాభా లెక్కల వివరాల నమోదుకు సంబంధించి ఇప్పటికే 30కి పైగా ప్రశ్నలను సిద్ధం చేసినట్టు సంబంధిత వర్గాల ద్వారా తెలిసింది. అందులో ఓ కొత్త ప్రశ్న కూడా ఉంది. అదే ఈ జనగణన ప్రత్యేకత.
పెద్ద మార్పు
దేశంలో 1872 నుంచి జనగణన చేస్తున్నారు. జనాభా లెక్కల సేకరణలో భాగంగా 1931 నుంచి ఒకే విధమైన ప్రశ్నలే అడుగుతూ వస్తున్నారు. అయితే 1951 నుంచి ఇప్పటి వరకు అడగని ఒక ప్రశ్న ఈసారి జనగణనలో అడుగుతారు. అదే మీ కులం ఏంటి? అని. ఇందులో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల గురించి సమాచారం ఇంతకు ముందే ఉంది. అయితే ఈసారి జనగణనలో ప్రతి ఒక్కరికీ తమ కులం గురించి చెప్పే ఆప్షన్ ఉంటుంది. జనాభా లెక్కల సేకరణలో ఈసారి వస్తున్న పెద్ద మార్పు ఇదే. 1931 తర్వాత ఇప్పుడు జనగణన, కులగణనను ఒకేసారి చేపడుతున్నారు.
ఈ ప్రక్రియలో ప్రతి వ్యక్తి, వారి కుటుంబం, వృత్తి, ఆరోగ్యం, విద్య, సామాజిక స్థాయి వంటి అంశాలను క్షుణ్ణంగా విశ్లేషించి, దేశ అభివృద్ధి కోసం ఉపయోగకరమైన సమాచారాన్ని సేకరించడం ముఖ్యంగా ఉంటుంది.

Read Also:APSRTC: రాజమహేంద్రవరం నుండి అరుణాచలంకి ఏపీఎస్ఆర్టీసీ సేవలు

a gazette notification Breaking News in Telugu for the census. Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today The Center has issued Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.