Thane Crime: రేబిస్ భయంతో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య

Read Time:  1 min
Thane Crime: రేబిస్ భయంతో బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య
FONT SIZE
GET APP

Thane Crime: మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఒక చిన్న సంఘటన ప్రాణాలను తీసిన విషాద ఉదంతం వెలుగులోకి వచ్చింది. వీధికుక్క కరిచిందన్న కారణంతో, భవిష్యత్తులో తనకు రేబిస్ వస్తుందేమోనన్న తీవ్ర భయంతో ఒక 30 ఏళ్ల బ్యాంకు ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. కల్యాణ్ ఈస్ట్‌లోని టిస్‌గావ్ నాకా ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఈ విషాదకర సంఘటన చోటుచేసుకుంది. మృతుడిని అయిష్ విశ్వనాథ్ అమీన్‌గా పోలీసులు గుర్తించారు.

Read also: Jharkhand Plane Crash: కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్

వ్యాక్సిన్ తీసుకున్నా వీడని భయం

వివరాల్లోకి వెళితే, అయిష్ విశ్వనాథ్ అమీన్ (30) అనే యువకుడు ఓ సహకార బ్యాంకులో గత ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతడిని ఓ వీధికుక్క కరిచింది. దీంతో యాంటీ-రేబిస్ వ్యాక్సిన్ వేయించుకున్నప్పటికీ, కేవలం ఒక డోసు మాత్రమే తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. ఆ తర్వాత నుంచి అయిష్ తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళనకు గురయ్యాడు.

Thane Crime: Bank employee commits suicide over fear of rabies
Thane Crime: Bank employee commits suicide over fear of rabies

తన ప్రవర్తనలో కూడా మార్పులు వచ్చినట్లు కుటుంబసభ్యులు గమనించారు.ఈ క్రమంలోనే, తనకు రేబిస్ సోకుతుందనే భయంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్ రాసి ఇంట్లోనే ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. సమాచారం అందుకున్న కొల్సేవాడి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ (ఏడీఆర్) నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

Aanusha

రచయిత గురించి

Aanusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.