📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు? ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం వాయు కాలుష్యానికి చెక్: గణనీయంగా తగ్గిన కాలుష్యం నేడు డెలివరీ గిగ్ వర్కర్ల సమ్మె లోయలో పడిన బస్సు, 7 మంది మృతి ముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి మృతి! పాన్-ఆధార్ లింక్ వీరికి తప్పనిసరి కాదు! ఇతర రాష్ట్రాల వాహనాలకు రూ. 20 వేల వరకు జరిమానా భారత్ లో ధనిక చెఫ్ ఎవరంటే? ఉత్తర్ ప్రదేశ్‌ లో కోట్లాది ఓటర్లు తొలగింపు?

Thackeray Cousins : 20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై థాక్రే సోదరులు

Author Icon By Sudha
Updated: July 5, 2025 • 3:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. థాక్రే సోదరులు (ఉద్ధవ్‌ థాక్రే, రాజ్‌ థాక్రే) మళ్లీ కలిశారు (Thackeray Cousins). దాదాపు 20 ఏళ్ల తర్వాత ఒకే వేదిక పంచుకున్నారు.ఇకపై ఇద్దరం కలిసే ఉంటామని ఈ సందర్భంగా సోదరులు స్పష్టం చేశారు.త్రిభాషా విధానం అమలుకు సంబంధించిన ఉత్తర్వులను మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇవాళ ముంబైలో ‘వాయిస్‌ ఆఫ్‌ మరాఠీ’ (‘Voice of Marathi’) కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే , మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రే ఇద్దరూ కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ (Thackeray Cousins)ఆప్యాయంగా మాట్లాడుకున్నారు. 2005లో విడిపోయిన ఈ ఇద్దరు అన్నదమ్ములు 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ కలుసుకోవడం మహా రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. అన్నదమ్ముల కలయికపై ఇరు పార్టీల కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

20 ఏళ్ల తర్వాత ఒకే వేదికపై థాక్రే సోదరులు

దేవేంద్ర ఫడ్నవీస్‌ వల్లే
మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ వల్లే తాము కలిశామని రాజ్‌ థాక్రే వ్యాఖ్యానించారు. సీఎం రాష్ట్రానికి వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయమే తమని కలిపిందన్నారు. అనుకోకుండానే ఒకే వేదికపై చేర్చారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై థాక్రే సోదరులు (Thackeray Cousins)తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఇకపై తామిద్దరం ఒక్కటిగా ఉంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. కాగా, అన్నదమ్ములిద్దరూ చివరి సారిగా 2005లో ఒకేవేదికపై కనిపించారు. ఆ తర్వాత శివసేనలో గొడవల కారణంగా రాజ్ థాక్రే పార్టీ వీడారు. 2006 మార్చి 9వ తేదీన సొంతంగా మహారాష్ట్ర నవ నిర్మాణ సేనను స్థాపించారు.

Read Also: hindi.vaartha.com

Read Also: Mysore: మైసూరులో ప్రేమోన్మాది దారుణం – నిరాకరించిందన్న కోపంతో

#IndianPolitics #MaharashtraPolitics #MNS #MumbaiPolitics #PoliticalReunion #RajThackeray #ShivSena #ThackerayCousins #ThackerayFamily #UddhavThackeray Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Maharashtra political news MNS news Paper Telugu News political developments in Mumbai Raj Thackeray news Shiv Sena news Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Thackeray brothers 20 years Thackeray cousins reunion Thackeray family history Thackeray family politics Today news Uddhav Thackeray and Raj Thackeray Uddhav Thackeray news Uddhav vs Raj Thackeray

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.