ఆసియాలోనే అతిపెద్ద (TG) గిరిజన పండుగగా గుర్తింపు పొందిన మేడారం మహా జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది.లక్షలాదిగా భక్తులు గిరిజన దేవతలను దర్శించుకోవడానికి తరలివస్తున్నారు. ఈ నేపథ్యంలో మేడారం మహా జాతర కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ, గిరిజన వ్యవహారాల శాఖలు సంయుక్తంగా రూ. 3.70 కోట్లు నిధులు విడుదల చేశాయి.
Read Also: Phone Tapping Case : ముగిసిన కేటీఆర్ విచారణ
పర్యాటకులకు మెరుగైన మౌలిక వసతులు
కాగా, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి.. ఈ నిధులు మంజూరు అయ్యేలా చొరవ తీసుకున్నారు.కాగా, మేడారం మహా జాతరకు భారీ సంఖ్యలో భక్తులు వస్తున్నందున.. మెరుగైన సదుపాయాలు కల్పించడానికి నిధులను విడుదల చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇదే కాకుండా గతంలో కూడా కేంద్ర పర్యాటక శాఖ నిధులు మంజూరు చేసింది.
మేడారంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ములుగు, లక్నవరం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతం వంటి ప్రాంతాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించానికి రూ. 80 కోట్లు ఇచ్చింది. గిరిజన సర్క్యూట్ పేరిట పర్యాటకులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడానికి, పలు అభివృద్ధి పనులు చేపట్టడానికి ఈ నిధులు విడుదల చేసింది. అంతకుముందు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ అభివృద్ధి కోసం రూ. 140 కోట్లు కేటాయించిన విషయం తెలిసిందే.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: