తెలంగాణ (TG) అసెంబ్లీ స్పీకర్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ ఫిరాయింపుల అంశంలో గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన స్పష్టమైన ఆదేశాలు అమలు చేయడం లేదని ఆరోపిస్తూ బీజేపీ నేత, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ వ్యవహారం న్యాయస్థాన పరిధిలోకి వెళ్లింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజయ్ కరోల్ ధర్మాసనం విచారణ చేపట్టింది.
Read Also: Siddipet: కుటుంబ కలహాలతో భార్య గొంతు కోసిన భర్త
ఫిబ్రవరి 6న విచారణ
మహేశ్వర్‌రెడ్డి చేసిన ఆరోపణలపై సమాధానం ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చింది. అనంతరం ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న పాడి కౌశిక్‌రెడ్డి, కేటీఆర్‌ల పిటిషన్లతో జత చేసింది. ఈ పిటిషన్లన్నింటిపైనా కలిపి ఫిబ్రవరి 6న విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను వాయిదా వేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: