📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

TG: ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు ప్రభాకర్ మృతి

Author Icon By Saritha
Updated: February 7, 2026 • 11:37 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మహారాష్ట్రలోని గడ్చిరోలి (భమ్రాగఢ్ తాలూకా ఫడేవా అటవీ ప్రాంతం)లో (TG) గురువారం నుంచి భద్రతా బలగాలు, మావోయిస్టుల (Maoists) మధ్య ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకూ ఏడుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ప్రకటించారు. గురువారం ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, నిన్న మరో నలుగురు హతమయ్యారు. 

Read Also: US: భారత ఫార్మా రంగానికి టారిఫ్ తాత్కాలిక ఊరట

Maoist Prabhakar killed in encounter.

ఈ ఎన్కౌంటర్లో మరణించిన వారిలో అత్యంత కీలకమైన వ్యక్తి ప్రభాకర్. (TG) తెలంగాణలోని కామారెడ్డి జిల్లా నివాసి అయిన ఈయన, సీపీఐ మావోయిస్టు సంస్థలో గడ్చిరోలి డివిజనల్ కమిటీ ఇన్చార్జ్, వెస్ట్ సబ్-జోనల్ బ్యూరో ఇన్చార్జ్, కంపెనీ నంబర్ 10 ఇన్చార్జ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రభాకర్పై ప్రభుత్వం రూ.25 లక్షల రివార్డు ప్రకటించిందంటే ఆయన ప్రాధాన్యతను అర్థం చేసుకోవచ్చు.

ఈ ఎదురుకాల్పుల్లో ఒక పోలీసు అధికారి ప్రాణాలు కోల్పోగా, మరో అధికారి తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఘటన స్థలం నుంచి ఒక ఏకే 47 రైఫిల్‌తో పాటు పలు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Bhamragad taluka encounter Gadchiroli Latest News in Telugu Maharashtra Maoists security forces Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.