Telugu News: TG: తవ్వకాల్లో దొరికిన బంగారం.. పంచుకునే విషయంతో గొడవ

Read Time:  1 min
TG
TG
FONT SIZE
GET APP

TG ఏమాత్రం కష్టపడకుండా తేరగా వచ్చేది ఏదైనా దానికోసం జనం ఎగబడతారు. ఇంకా దాన్ని సొంతం చేసుకునేందుకు ఎంతకైనా తెగిస్తారు. భౌతిక దాడులు చేసుకునేందుకు కూడా వెనుకాడరు. గుప్త నిధులు ఉన్నాయన్న సమాచారంతో కొందరుతవ్వకాలు జరిపారు.

Read also : Hidma: హిడ్మా ఎన్‌కౌంటర్‌పై మావోయిస్టు పార్టీ లేఖ

అనుకున్నట్లుగా బంగారం దొరికింది. దాన్ని గుట్టుచప్పుడు కాకుండా పంచుకుంటే బాగుండేది. కానీ దాన్ని స్వార్థంతో సొంతం చేసుకోవాలనే ఉబలాటంలో గొడవలకు దిగారు. ఇంకేమీ ఉంది ఆ పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్ కు చేరింది. పోలీసులు రంగప్రవేశం చేసి, ఐదుగురి వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

TG
TG Gold found in excavations… a dispute over sharing

గుప్తనిధుల కోసం తవ్వకాలు

ములుగు జిల్లా (Mulugu District) మంగపేట మండలానికి చెందిన ఓ ఆటో డ్రైవర్ కు మహారాష్ట్రలోని సిరివంచ సమీపంలో ఉన్న ఓ ఇంట్లో బంగారం నిధి ఉందని తెలిసింది. ఈ గుప్త నిధి సమాచారం తెలిసిన వెంటనే ఇదే గ్రామానికి చెందిన నలుగురిని తీసుకుని ఒక కారులో మహారాష్ట్రలోని సిరివంచకు వెళ్లారు. సిరివంచ నుంచి 30కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ గ్రామానికి వెళ్లారు అక్కడ ఓ ఇంట్లో బంగారం ఉన్నదని తెలిసిన సమాచారంలో ఆ ఇంట్లో ఐదురోజులపాటు గడిపి బంగారు (gold) నిధి ఉన్నప్రాంతంలో పూజలు జరిపి తవ్వకాలు చేపట్టారు. అనుకున్నట్లుగా వారికి ఒక రాగిబిందె దొరికింది. 

అనంతరం దీనిపై దుష్టశక్తి ఉందని దానిని తొలగించాక వస్తామని ఇంటి యజమానికి చెప్పి దాన్ని తీసుకుని మంగపేటకు వచ్చారు. అనంతరం మూడు కోళ్లను బలిచ్చి పూజలు నిర్వహించారు. అనంతరం పంపకంలో వీరిమధ్య తేడాలు వచ్చాయి. దీంతో ఆనోట .. ఈనోట అందరికీ తెలిసిపోయింది. ఇది కాస్త పోలీసులకు కూడా తెలియడంతో వీరిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ఈ బిందెలో మొత్తం 36 బంగారం బిళ్లలు ఉన్నాయని విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఒక్కోబిళ్ల 23గ్రాముల బరువు ఉందని పోలీసులకు వారు వివరించినట్లు సమాచారం. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు.

Read hindi news: https://hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.