📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

Latest News: TG Cabinet: గిగ్ వర్కర్స్ బిల్లుకు టీజీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్

Author Icon By Aanusha
Updated: November 17, 2025 • 10:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తెలంగాణ ప్రభుత్వం గిగ్, ప్లాట్‌ఫామ్ ఆధారిత కార్మికుల కోసం కీలకమైన, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో డిమాండ్ ఆధారంగా పనిచేసే డెలివరీ బాయ్స్‌, క్యాబ్ డ్రైవర్లు, హోం సర్వీస్ వర్కర్లు, లాజిస్టిక్స్ సిబ్బంది వంటి లక్షలాది మంది గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలకు చట్టపరమైన భరోసా కల్పించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది.

Read Also: Auto Drivers : ఆటోడ్రైవర్ల సమస్యలపై కాంగ్రెస్ కు చిత్తశుద్ధి లేదు – KTR

ఈ పరిణామంలో భాగంగా ‘తెలంగాణ ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ చట్టం – 2025 (TG Cabinet)’ ముసాయిదాకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇది రాష్ట్ర కార్మిక రంగంలో సంస్కరణలకు నాంది పలికే కీలక బిల్లుగా భావిస్తున్నారు. డిసెంబర్ 2024లో జరిగిన గిగ్ వర్కర్ల సమాలోచన సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర కార్మిక, ఉపాధి, శిక్షణ విభాగం న్యాయ శాఖతో కలిసి ముసాయిదా బిల్లును సిద్ధం చేసింది.

అన్ని వాటాదారుల అభిప్రాయాలు సేకరించిన తర్వాత కేబినెట్ చివరి ఆమోదం తెలిపింది. ఈ బిల్లుతో గిగ్ కార్మికులకు మొదటిసారిగా చట్టపరమైన గుర్తింపు లభిస్తుంది. ప్రత్యేక ఐడీతో రాష్ట్ర పథకాలు, సంక్షేమ రక్షణకు అర్హత కలుగుతుంది. గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం 20 మంది సభ్యుల బోర్డును ఏర్పాటు చేస్తారు.

బోర్డుకు కార్మిక శాఖ మంత్రి అధ్యక్షత వహిస్తారు.

ఇందులో ప్రభుత్వం, ప్లాట్‌ఫామ్ కంపెనీలు, కార్మిక సంఘాలు, పౌర సమాజం, టెక్నికల్ నిపుణులు ఉంటారు. బోర్డుకు కార్మిక శాఖ మంత్రి అధ్యక్షత వహిస్తారు.కార్మికుల హక్కులను స్పష్టంగా నిర్వచించిన ఈ బిల్లులో రిజిస్ట్రేషన్ హక్కు, భద్రమైన పని వాతావరణం, వేతనాల్లో పారదర్శకత, అల్గోరిథమిక్ నిర్ణయాల వివరాలు తెలిసే హక్కు వంటి అంశాలు ఉన్నాయి.

ప్లాట్‌ఫామ్ కంపెనీలు 60 రోజుల్లోపు కార్మికుల డేటాను ప్రభుత్వానికి అందించాలి. అగ్రిగేటర్లు 45 రోజుల్లోపు తప్పనిసరిగా నమోదు కావాలి. సంక్షేమ నిధి ఏర్పాటు ఈ బిల్లో కీలక అంశం. అగ్రిగేటర్ చెల్లింపులపై ప్రభుత్వం నిర్ణయించే శాతంలో సంక్షేమ రుసుము, ప్రభుత్వ గ్రాంట్లు, CSR విరాళాలు, వ్యక్తిగత సహకారం వంటి వాటితో నిధి సమీకరిస్తారు.

TG Cabinet gives green signal to Gig Workers Bill

పారదర్శకతను చట్టబద్ధం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ

ప్రమాద మరణ పరిహారం, ఆరోగ్య సహాయం, వివాహ సహాయం వంటి పథకాలకు ఈ నిధిని వినియోగిస్తారు.అల్గోరిథమిక్ పారదర్శకతను చట్టబద్ధం చేసిన తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలుస్తోంది. అసైన్మెంట్‌లు, ప్రోత్సాహకాలు, రేటింగ్‌లను అల్గోరిథంలు ఎలా ప్రభావితం చేస్తున్నాయి అనేదాన్ని ప్లాట్‌ఫామ్‌లు బహిర్గతం చేయాలి.

వేతనాలను ప్రభావితం చేసే ఆటోమేటెడ్ నిర్ణయాలు కూడా కార్మికులకు తెలియజేయాలి. ఫిర్యాదుల పరిష్కారం కోసం త్రిస్థాయి వ్యవస్థను ప్రతిపాదించారు. ప్లాట్‌ఫారం స్థాయి వివాద పరిష్కార కమిటీ, ప్రభుత్వం నియమించే ఫిర్యాదు అధికారి, డిప్యూటీ కమిషనర్ స్థాయి అప్పీలేట్ అథారిటీ ఉండనున్నాయి.

కార్మిక-ప్లాట్‌ఫారం సంబంధాల మెరుగుదల

ఒప్పంద మార్పులకు 14 రోజుల నోటీసు, తప్పనిసరి కారణాలు మినహా తొలగింపుకు 7 రోజుల నోటీసు ఇవ్వాల్సి ఉంటుంది.కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, జార్ఖండ్ వంటి రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ బిల్లు అత్యంత సమగ్రంగా ఉండడం విశేషం. CSR నిధులను కూడా స్పష్టంగా చేర్చడం తెలంగాణ చట్టానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

రాష్ట్ర శ్రామిక రంగాన్ని ఫార్మలైజేషన్ దిశగా తీసుకెళ్లడమే కాకుండా గిగ్ వర్కర్ పాలనలో తెలంగాణను జాతీయ స్థాయిలో ముందుండేలా చేయడమే ఈ చట్టం లక్ష్యం. గిగ్ వర్కర్ల సంక్షేమం, కార్మిక-ప్లాట్‌ఫారం సంబంధాల మెరుగుదల, డేటా ఆధారిత పాలనకు ఇది మైలురాయిగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

latest news platform workers law Telangana gig workers bill Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.