📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Latest Telugu News : Tesla – భారత్‌లో తొలి కారును డెలివరీ చేసిన టెస్లా..

Author Icon By Sudha
Updated: September 5, 2025 • 5:08 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత విపణిలోకి అడుగుపెట్టిన తర్వాత టెస్లా తాజాగా తన తొలి కారు (Tesla car)ను కస్టమర్‌కు డెలివరీ చేసింది.ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన లగ్జరీ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిగ్గజం టెస్లా (Tesla) అధికారికంగా భారత విపణిలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఏడాది జులై 15న ఆర్థిక రాజధాని ముంబైలో తొలి షోరూంను ప్రారంభించింది. ఆ తర్వాత ఢిల్లీలో రెండో షోరూంను కూడా లాంఛ్‌ చేసింది. భారత విపణిలోకి అడుగుపెట్టిన తర్వాత టెస్లా తాజాగా తన తొలి కారు (Tesla car)ను కస్టమర్‌కు డెలివరీ చేసింది. తెలుపు రంగు టెస్లా ‘వై మోడల్‌’ కారును మహారాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్‌ సర్‌నాయక్‌ (Pratap Sarnaik) కొనుగోలు చేశారు. ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ లోని టెస్లా ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ నుంచి తొలి కారును ఇవాళ మంత్రికి సంస్థ ప్రతినిధులు డెలివరీ చేశారు. కారు తాళాలను అందజేశారు. ఈ సందర్భంగా దేశంలోనే తొలి టెస్లా కారును కొనుగోలు చేయడం పట్ల మంత్రి ప్రతాప్‌ సర్‌నాయక్‌ సంతోషం వ్యక్తం చేశారు. విద్యుత్‌ వాహనాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే తాను ఈ కారును కొనుగోలు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

Tesla – భారత్‌లో తొలి కారును డెలివరీ చేసిన టెస్లా..

ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్లలో అత్యధిక అమ్మకాలతో రికార్డు నెలకొల్పిన ‘వై’ మోడల్ కార్లను (Tesla Y Model) భారత వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది టెస్లా. RWD (రియర్-వీల్ డ్రైవ్), లాంగ్-రేంజ్ RWD వేరియంట్‌ కార్లను అమ్మకానికి ఉంచింది. ఇక ధర విషయానికొస్తే రియర్-వీల్ డ్రైవ్ (ఆర్‌డబ్ల్యూడీ) వేరియంట్‌ ధర రూ. 59.89 లక్షలు, లాంగ్-రేంజ్ ఆర్‌డబ్ల్యూడీ వేరియంట్‌ ధరను రూ. 67.89 లక్షలుగా నిర్ణయించింది. వీటి ‘ఆన్ రోడ్’ ధరల్ని పరిశీలిస్తే RWD వెర్షన్ ఆన్-రోడ్ ధర రూ. 61.07 లక్షలుకాగా, లాంగ్-రేంజ్ వెర్షన్ ఆన్-రోడ్ ధర రూ. 69.15 లక్షలుగా ఉంది. టెస్లా అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఇందులో 18 శాతం జీఎస్టీతో సహా రూ. 50,000 అడ్మినిస్ట్రేషన్, సర్వీస్ ఫీజు కూడా ఉంటుంది. అయితే, భారత్‌లో సగటు ఎలక్ట్రిక్‌ కారు ధర రూ.22 లక్షలు ఉంది. టెస్లా మోడల్‌ వై ధర దాదాపు రూ.60 లక్షల వరకు ఉంది. మరోవైపు ఎన్నో అంచనాలతో భారత మార్కెట్‌లోకి అడుగుపెట్టిన ఈ సంస్థకు నిరాశే ఎదురైంది. ఆశించిన స్థాయిలో బుకింగ్స్‌ జరగలేదని సమాచారం. బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం.. జులై నుంచి ఇప్పటి వరకూ మొత్తం 600 బుకింగ్స్‌ మాత్రమే వచ్చాయి. కంపెనీ అంచనాల కంటే ఇవి చాలా తక్కువ. ఎందుకంటే టెస్లా ప్రపంచ వ్యాప్తంగా కేవలం నాలుగు గంటల్లోనే ఇన్ని కార్లను విక్రయిస్తుంది. దీంతో భారత్‌లో టెస్లాకు అనుకున్నంత స్పందన రాలేదని కంపెనీకి చెందిన కీలక వ్యక్తులను ఊటంకిస్తూ బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. టెస్లాకు బ్రాండ్ పేరు ఉన్నప్పటికీ ఎక్కువ ధర కారణంగా భారత EVమార్కెట్‌లో పెద్దగా ప్రభావం చూపలేకపోతోందన్నది టాక్‌.

భారతదేశంలో టెస్లా యజమాని ఎవరు?

మీడియా నివేదికల ప్రకారం, ఎస్సార్ గ్రూప్ డైరెక్టర్ ప్రశాంత్ రుయా భారతదేశంలో టెస్లా కారును కలిగి ఉన్న మొదటి వ్యక్తి. ప్రశాంత్ వద్ద టెస్లా మోడల్ X SUV ఉంది మరియు ఇది ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ SUVగా పిలువబడే ప్లాయిడ్ వేరియంట్‌ను కలిగి ఉంది. టెస్లా మోడల్ X పూర్తిగా ఛార్జ్ చేయబడిన తర్వాత 540 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.

భారతదేశంలో టెస్లా కార్ల సంఖ్య?

భారతదేశంలోకి టెస్లా ఇంక్ ప్రవేశం ఇప్పటివరకు నిరాశాజనకమైన ఫలితాలను అందించింది, బుకింగ్‌లు మందకొడిగా ఉండటం కంపెనీ ప్రపంచ వృద్ధి దృక్పథంపై కొత్త సందేహాలను రేకెత్తిస్తోంది. జూలై మధ్యలో అమ్మకాలు ప్రారంభించినప్పటి నుండి కంపెనీ 600 కంటే ఎక్కువ కార్లకు ఆర్డర్‌లను అందుకుంది మరియు ఇప్పుడు ఈ సంవత్సరం 350 నుండి 500 కార్లను భారతదేశానికి రవాణా చేయాలని యోచిస్తోంది.

టెస్లా కార్లు ఎక్కువగా ఎక్కడ అమ్ముడవుతాయి?

2023లో టెస్లాకు అమెరికా మరియు చైనా అతిపెద్ద EV మార్కెట్లుగా ఉన్నాయి — అమెరికాలో 654,888 EV అమ్మకాలు మరియు చైనాలో 603,304 EVలు అమ్ముడయ్యాయి.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/relief-for-common-man-with-gst-reduction-bjps-ramchandra-rao/national/541823/

Breaking News Electric Vehicles EV India First Tesla Car India latest news Telugu News Tesla Delivery Tesla India

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.