భారత్ (India)లో ఉగ్రవాద దాడులు జరిపేందుకు కుట్ర పన్నుతున్న ఓ ముఠా పట్టుబడింది. పుణ్యక్షేత్రాలు, కీలక ప్రదేశాల ఫొటోలు, వీడియోలు, లొకేషన్ వివరాలు సరిహద్దు అవతల ఉన్న పాకిస్థాన్(Pakistan) హ్యాండ్లర్లకు సోషల్ మీడియా ద్వారా పంపుతున్నారనే ఆరోపణలపై పాక్ ఆధారిత గ్యాంగ్‌స్టర్ నెట్‌వర్క్‌కు చెందిన ఇద్దరు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అధికారులు ఉగ్రకోణంలో దర్యాప్తు చేపడుతున్నారు.
Read Also: TTD: తిరుమలలో 80 లగేజీ కౌంటర్లు అందుబాటులోకి!
ఐబీ నుంచి పోలీసులకు వచ్చిన సమాచారం
ఉత్తర్‌ప్రదేశ్ హాపుడ్‌లోని మొఘల్ గార్డెన్‌లో ఉన్న ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఇద్దరు యువకులను అరెస్టు చేసినట్లు పోలీసులు గురువారం మీడియాకు వెల్లడించారు. అరెస్టు అయిన యువకులు ఒక ఆలయం, దిల్లీ కాలనీకి సంబంధించిన ఫొటోలు, వీడియోలు, లొకేషన్స్‌ను సోషల్ మీడియా ద్వారా ఒక పాకిస్థానీ గ్యాంగ్‌కు పంపుతున్నారని ఐబీ నుంచి తమకు సమాచారం అందిందని పేర్కొన్నారు. ఈ మేరకు తాము ఇద్దర్ని అరెస్ట్ చేశామని వెల్లడించారు. ఇటీవలే (మార్చి 15న) గాజియాబాద్‌లోని కౌశాంబి పోలీసులు ఆరుగురు యువకులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా 50 ప్రదేశాలలో రహస్య సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడానికి వారు ప్రణాళికలు వేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కెమెరాలలో ఒకటి హరియాణాలోని సోనిపత్ రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ నంబర్ 3 దగ్గర ఉన్న హై వోల్టేజ్ విద్యుత్ లైన్ స్తంభానికి నిందితులు అమర్చారు. ఈ క్రమంలో ఐబీ, ఎన్ఐఏ, ఇండియన్ రైల్వేస్ అధికారుల పర్యవేక్షణలో గాజియాబాద్ పోలీసులు బుధవారం (మార్చి 18) ఆ స్తంభం నుంచి రహస్య సీసీటీవీ కెమెరాను స్వాధీనం చేసుకున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: