US: భారత ఫార్మా రంగానికి టారిఫ్ తాత్కాలిక ఊరట

Read Time:  1 min
US: భారత ఫార్మా రంగానికి టారిఫ్ తాత్కాలిక ఊరట
FONT SIZE
GET APP

అమెరికా-భారత్ మధ్య కుదిరిన మధ్యంతర వాణిజ్య ఒప్పందం భారతీయ ఔషధ రంగానికి తాత్కాలిక ఊరటను కల్పించింది. ఈ ఒప్పందం ప్రకారం.. భారతదేశం(India) నుంచి అమెరికా(America)కు వెళ్లే ఔషధ ఎగుమతులు వాషింగ్టన్ విధించే పరస్పర సుంకాల నుంచి ప్రస్తుతం రక్షణ పొందనున్నాయి. విస్తృత భారతీయ ఎగుమతులపై 50 శాతం వరకు ఉన్న సుంకాలను 18 శాతానికి తగ్గించినప్పటికీ, ఔషధ రంగానికి ప్రత్యేక మినహాయింపులు కల్పించడమే ఈ ఒప్పందంలోని ముఖ్యాంశంగా మారింది. అయితే, ఈ రక్షణ శాశ్వతం కాదని.. మధ్యంతర వాణిజ్య ఒప్పందం విజయవంతంగా ముగియడం, అమెరికా జాతీయ భద్రతకు సంబంధించిన ప్రత్యేక దర్యాప్తు (US Section 232) తుది ఫలితంపై ఇది ఆధారపడి ఉంటుందని.. శనివారం విడుదలైన రెండు దేశాల సంయుక్త ప్రకటన స్పష్టం చేసింది. ఈ ఒప్పందం కింద అమెరికా నుంచి భారతదేశానికి వచ్చే వైద్య పరికరాలపై ఉన్న సుంకం కాని అడ్డంకులను తగ్గించేందుకు భారత్ అంగీకరించింది.

Read Also: Islamabad Blast: మసీదులో భారీ పేలుడు..పలువురు మృతి

US: భారత ఫార్మా రంగానికి టారిఫ్ తాత్కాలిక ఊరట
US: భారత ఫార్మా రంగానికి టారిఫ్ తాత్కాలిక ఊరట

పరస్పర సుంకాల నుంచి తాత్కాలిక మినహాయింపు

దీని ద్వారా, అమెరికన్ మెడికల్ డివైజ్ తయారీదారులకు భారత మార్కెట్‌లో సులభమైన ప్రవేశం లభించనుంది. అదే సమయంలో, ఔషధ సరఫరా గొలుసులను మరింత భద్రపరచడం, వైద్య సాంకేతికతకు మార్కెట్ ప్రాప్యతను విస్తరించడం వంటి అంశాలపై ఉమ్మడి రోడ్‌మ్యాప్‌ను ఈ ప్రకటన వివరిస్తోంది. ఈ మధ్యంతర ఒప్పందం.. భవిష్యత్తులో కుదిరే సమగ్ర అమెరికా-భారత్ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి (BTA) పునాదిగా పరిగణించబడుతోంది. ఇటీవలి కాలంలో పెరిగిన వాణిజ్య ఉద్రిక్తతలను ఇది గణనీయంగా తగ్గించగలదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రత్యేకంగా యాంటీబయాటిక్స్, వ్యాక్సిన్లు, బల్క్ డ్రగ్స్, డ్రగ్ ఇంటర్మీడియట్స్‌తో పాటు జనరిక్ ఔషధాల ఎగుమతులకు పరస్పర సుంకాల నుంచి తాత్కాలిక మినహాయింపు ఇవ్వడం భారతీయ ఔషధ పరిశ్రమకు కీలకంగా మారింది. అయితే, ఈ మినహాయింపు మధ్యంతర ఒప్పందం సఫలీకృతమయ్యే వరకు మాత్రమే వర్తిస్తుందని సంయుక్త ప్రకటన స్పష్టం చేసింది. ఇండియా–యూఎస్ ట్రేడ్ డీల్‌పై పీయూష్ గోయల్ ప్రకటన.. భారత ఆర్థిక ప్రయోజనాలే లక్ష్యంగా.. కొత్త ఫ్రేమ్‌వర్క్ ప్రకారం.. అమెరికా వివిధ భారతీయ ఉత్పత్తులపై పరస్పర సుంకాలను 50 శాతం నుంచి 18 శాతానికి తగ్గిస్తుంది. ఇది ప్రపంచ ఔషధ తయారీ కేంద్రంగా భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుందని అంచనా. అవసరమైన మందుల సరఫరా నిలకడగా కొనసాగాలన్నది కూడా అమెరికా ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రస్తుతం, భారతీయ ఔషధ కంపెనీలు ఏటా దాదాపు 10 బిలియన్ డాలర్ల విలువైన ఔషధ ఉత్పత్తులను అమెరికాకు ఎగుమతి చేస్తున్నాయి. వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ శనివారం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. జెనరిక్ ఫార్మాస్యూటికల్స్, రత్నాలు-వజ్రాలు, విమాన భాగాలు వంటి అనేక ఉత్పత్తులపై సుంకాలు సున్నాకు తగ్గే అవకాశం ఉందని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.