Uttarpradesh-ఇంట్లో చంటి పిల్లలు ఉంటే ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. వారి నిద్రిస్తున్న సమయంలో కాస్త రిలాక్స్ అవుతుంటారు కుటుంబ సభ్యులు. ఆ కాస్త రిలాక్స్ సమయమే ఆ పాపకు ఆయుష్షు లేకుండా చేసింది. పాప నిద్రపోతుందని ఆ కుటుంబ సభ్యులు(Family Members) కాస్త పనిలో మునిగిపోయారు. ఇంకేమీ ఉంది ఇంట్లోకి ప్రవేశించిన కోతులు పాపను లాక్కిళ్లి చంపేశాయి.
డ్రమ్ములో పడేసిని కోతులు
ఉత్తరప్రదేశ్(Uttar pradesh) లో జరిగిన ఈ దారుణ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ అనే గ్రామంలో ఓ ఇంట్లో కోతులు ప్రవేశించాయి. అదే సమయంలో రెండేళ్ల పాప నిద్రపోతోంది. దీంతో కోతులు ఆ పాపను గాయపరుస్తూ, లాక్కెళ్లాయి. అంతటితో ఆగక ఇంటిపైన ఉన్న నీళ్ల డ్రబులో పడేశాయి. ఇంటిపై నుంచి పాప ఏడుపు శబ్దం వినిపించడంతో బయట ఉన్న కుటుంబ సభ్యులు హుటాహుటీగా పైకి చేరుకున్నారు. అక్కడ వెతకగా నీళ్ల డ్రమ్ములో పాప కనిపించింది. ఆ చిన్నారిని వెంటనే బయటకు తీసి, ఆసుపత్రికి తరలించారు. కానీ ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆ పాప మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై సీతాపూర్ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా తగిన చర్యలు తీసుకోలేదని వాపోయారు.
అధికారుల నిర్లక్ష్యంతో తమకు ఈ నష్టం
అధికారుల నిర్లక్ష్యంతో తమకు తీరని అన్యాయం జరిగిందని, కడుపుకోతకు గురిచేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు గ్రామంలో కోతులు తరచూ చిన్నారులు, వృద్ధులపై దాడులు చేస్తున్నాయంటూ వాపోతున్నారు. ఈ ఘలనకు కారణమైన ఆటవీశాఖ అధికారులపై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. మూగజీవాలను ప్రేమించాల్సిందే. అయితే మూగజీవాలకంటే మనుషుల ప్రాణాలు ముఖ్యం. కుక్కల దాడిలో ప్రాణాలను కోల్పోయిన సంఘటన కేసులో ఇటీవల సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. అలాగే కోతుల అదుపుపై కూడా ఏదైనా నిబంధనలు తెస్తే బాగుంటుంది అనేది కొందరి భావన. ఎందుకంటే రోడ్లపై వెళ్తున్న వారిపై కోతుల గుంపుల దాడులు కూడా పెరుగుతున్నాయి. మన చేతిలో ఎలాంటి ఆయుధం లేకపోతే కోతుల నుంచి, కుక్కల నుంచి తప్పించుకోవడం కష్టంగా అవుతున్నది. వీటి దాడులో ఎందరో గాయపడుతున్నారు.
స్థానికులు, అధికారులు ఎలా స్పందించారు?
గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. అధికారులు కోతుల సంఖ్య పెరగడం, ఆహారం కోసం గ్రామాల్లోకి రావడం కారణమని చెప్పారు.
భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఏ చర్యలు తీసుకుంటారు?
అటవీశాఖ ప్రత్యేక బృందాలను పంపి కోతులను పట్టుకోవడం, పునరావాసం కల్పించడం వంటి చర్యలు చేపట్టనున్నారు.
Read hindi news : hindi.vaartha.com
Read also: