📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: EC-ఈసీ, రాజకీయ పార్టీల మధ్య విభేదాలు.. బాధాకరం అన్న సుప్రీంకోర్టు

Author Icon By Pooja
Updated: September 1, 2025 • 5:38 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

EC: ఇటీవల ఈసీకి రాజకీయ పార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు ఆరోపణల వర్షం కురుస్తూనే ఉంది.ఈ పోకడలపై సుప్రీంకోర్టు(Supreme court) కూడా కీలకవ్యాఖ్యలు చేసింది. కేంద్రప్రభుత్వంతో ఈసీ కుమ్మక్కై ఓటర్లను తారుమారుచేస్తూ ఓటు కుంభకోణానికి పాల్పడుతున్నదని ఇండియా కూటమి ఆరోపిస్తున్నది. దీంతో బీహార్ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓటర్ల జాబితాలో మర్పులు, చేర్పుల కోసం నామినేషన్ల దాఖలుకు చివరితేదీ వరకు అవకాశం ఉంటుందని ఎన్నిక సంఘం (ఈసీ) కోర్టుకు స్పష్టం చేసింది. దీంతో సెప్టెంబర్ 1తోముగిసిన గడువుపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తేలిపోయింది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్నికల సంఘం ఆగస్టు 1న ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేసింది. దీనిపై అభ్యంతరాలు తెలిపేందుకు సెప్టెంబర్ 1ని తుది గడువుగా నిర్ణయించింది. ఈ గడువును పొడిగించాలని కోరుతూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై సోమవారం విచారణ జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘం తన వైఖరిని తెలియజేసింది. అభ్యంతరాలను సెప్టెంబర్ 30 తర్వాత కూడా స్వీకరిస్తామని, నామినేషన్ల ప్రక్రియ ముగిసేంత వరకు సవరణలు కొనసాగుతాయని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చింది.

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

ఈసీ వివరణ అనంతరం, సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎన్నికల సంఘం, రాజకీయ పార్టీల మధ్య ఇలాంటి విభేదాలు తలెత్తడం దురదృష్టకరమని అబభిప్రాయపడింది. అదే సమయంలో, ఓటర్ల జాబితాలో(voters’ list) ఫిర్యాదులు చేయడంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాలంటీర్లను నియమించాలని బీహార్ లీగల్ సర్వే అథారిటీని ఆదేశించింది.

ఈసీకి, రాజకీయ పార్టీలకు మధ్య వివాదానికి కారణం ఏమిటి?

ఓటర్ల జాబితాను తారుమారు చేసి, ఓటు కుంభకోణానికి పాల్పడుతున్నారని ఇండియా కూటమి ఈసీపై ఆరోపణలు చేయడమే ఈ వివాదానికి కారణం.

సుప్రీంకోర్టులో ఏ పిటిషన్‌పై విచారణ జరిగింది?

బీహార్ ఓటర్ల జాబితా సవరణ గడువును పొడిగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/anushka-shetty-career-plans-ghati-interview-rana/cinema/539529/

Breaking News in Telugu Election Commission of India Election irregularities India alliance Latest News in Telugu political parties Supreme Court of India Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.